Nidhi Agarwal : నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్.. గ్లామర్ షో వెనుక అంత పెద్ద రహస్యమా?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నిధి అగర్వాల్( Nidhi Agarwal ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అక్కినేని నాగచైతన్య( Akkineni Naga Chaitanya ) హీరోగా నటించిన సవ్యసాచి సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిధి, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Nidhi Agarwal Says Opportunities Will Only If You Glamor Exposure-TeluguStop.com

ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.కాగా నిధి అగర్వాల్ కు అందం అభినయం అన్ని ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు.

టాలీవుడ్లో రామ్ పోతినేని( Ram pothineni ), నాగచైతన్య, అఖిల్ లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది.ఈమె చివరగా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.తర్వాత మళ్లీ ఆమెకు అవకాశాలు రాలేదు.ఇకపోతే సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువుగా ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా నిధి అగర్వాల్ సినిమాలలో అవకాశాలపై ఎక్స్పోజింగ్ పై స్పందించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

అందాలు ఎక్స్ పోజింగ్ చేస్తేనే ఇప్పుడు అవకాశాలు వస్తుంటాయి.

అంతే తప్ప ట్యాలెంట్ చూసి అవకాశాలు వస్తున్నాయని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మవద్దు.ఎందుకంటే ఇప్పటి జనరేషన్ గ్లామర్ వైపు ఉంది.గ్లామర్ ఎక్స్ పోజ్ చేయకుంటే మనల్ని ఎవరూ చూడరు.కనీసం దర్శకులు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వరు.సీన్ కు తగ్గట్టు మనం డ్రెస్ వేసుకుని ఎక్స్ పోజ్ చేయాల్సి ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నిధి అగర్వాల్.

ప్రస్తుతం ఇది అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు ఆమెకు అనుగుణంగా స్పందిస్తుండగా మరికొందరు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube