రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, తంగాలపల్లి, వేములవాడ లలో పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించి డ్యూటీలలో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలలో మొబైల్ ఫోన్లకు ఎలాంటి అనుమతి లేదు,విద్యార్థుల భవిష్యత్ ముఖ్యం దీనికోసం పరీక్ష కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చేస్తున్నామని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నరు.

పరీక్ష కేంద్రాల లోపలికి వెళ్ళేటప్పుడు గేట్ వద్ద డ్యూటీ చేస్తున్న అధికారులు లోనికి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సూచించారు.పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే పోలీస్ అధికారులకు తెలియజేయాలని పరీక్ష నిర్వహణ సిబ్బందికి తెలిపారు.ఎస్పీ డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ లు అనిల్ కుమార్, ఉపేందర్, వెంకటేష్ సిబ్బంది ఉన్నారు.







