పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో “ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) సినిమా తెరకెక్కుతోంది.ఏప్రిల్ 5 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినట్లు మేకర్స్ ప్రకటన చేయడం జరిగింది.
అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు.పోలీస్ డ్రెస్ లో పవన్ కళ్యాణ్ కుర్చీలో కూర్చున్న ఫోటో మేకర్స్ రిలీజ్ చేశారు.“గబ్బర్ సింగ్( Gabbar Singh )తరహా లోనే పవన్ కళ్యాణ్ ఒక చేతిలో గన్ మరో చేతిలో టీగ్లాస్ పట్టుకుని కుర్చీలో కూర్చున్న ఫోటో రిలీజ్ చేయడం జరిగింది.
దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఆనందంగా ఉన్నారు.
ఫోటో బట్టి చూస్తే పోలీస్ స్టేషన్ లో పవన్.సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు బ్యాక్ నుండి స్టిల్ ఉంది.
గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించిన “గబ్బర్ సింగ్” తరహా లోనే పవన్ లేటెస్ట్ లుక్ ఉంది.సో “గబ్బర్ సింగ్” సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ “ఉస్తాద్ భగత్ సింగ్” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
గతంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరిగింది.అయితే తాజాగా పోలీస్ డ్రెస్ లో కూర్చోవడంతో… ఫ్యాన్స్ పవన్( Pawan Kalyan ) పాత్ర పై క్లారిటీ రావడం జరిగింది.
మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) ట్విట్టర్ లో పవన్ పోలీస్ ఫోటో పోస్ట్ చేసి దానిపైన ఉస్తాద్ ఊచకోత షురూ అనే క్యాప్షన్ పెట్టడం జరిగింది.







