జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీలో ఆసక్తికర చర్చ జరిగింది.తెలుగు దేశం పార్టీ తో( TDP ) కలిసి వెళ్దాం అంటూ బీజేపీ ( BJP ) అధినాయకత్వం వద్ద పవన్ కళ్యాణ్ ప్రస్తావించి ఉంటాడు అంటూ అంతా భావించారు.
కానీ ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ రాలేదు.ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పొత్తుల విషయంలో ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదు.
మీకు అవసరం అయినప్పుడు కాదు.మేము అనుకున్నపుడు మాత్రమే పొత్తుల గురించి మాట్లాడుతాం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశాడు.

ఆ వ్యాఖ్యలతో పొత్తుల విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకు ఢిల్లీలో బీజేపీ నాయకులతో పవన్ మాట్లాడింది ఏంటీ అంటూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.ఏపీకి కేంద్రం నుండి రావాల్సిన నిధులు మరియు కావాల్సిన పథకాల గురించి ఏమైనా చర్చించారా అంటే అది కూడా లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు దేశం పార్టీ తో 2014 తరహా లో పొత్తు తో ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ భావిస్తున్నాడు.

కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కు బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం అస్సలు బీజేపీతో పొత్తు వద్దు అంటున్నారు.మరో వైపు వైకాపా ను గద్దె దించడమే మా లక్ష్యం.ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వం అంటూ ప్రకటించాడు.పవన్ వ్యాఖ్యల్లో క్లీయర్ గా 2014 పొత్తులను కంటిన్యూ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.అందుకు బీజేపీ నో చెబితే పరిస్థితి ఏంటీ అనేది క్లారిటీ లేదు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ హడావుడి ఢిల్లీలో ముగిసింది కానీ ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు.







