మరిదితో వదిన వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో..?

ఓ మహిళ వివాహం చేసుకొని అత్తారింట్లోకి అడుగు పెట్టాక భర్త తమ్ముడిపై కన్నేసింది.భర్తకు తెలియకుండా మరిదితో వివాహేతర సంబంధం( Extramarital Affair ) పెట్టుకుంది.

 Married Women Extra Marital Affair With Husband Brother,extra Marital Affair,hus-TeluguStop.com

కొంతకాలం మరిదితో ఎంజాయ్ చేసి, తన భర్తను అడ్డు తొలగించాలనుకుంది.అందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ రచించింది.

ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండలం లోని ఇంద్రానగర్ గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే ఇంద్ర నగర్ గ్రామంలోని భరత్ నగర్ కాలనీలో చిట్యాల బాలకృష్ణ, శైలజ దంపతులు నివాసం ఉంటున్నారు.

పెళ్లయిన మొదటి సంవత్సరం వీరి సంసారం సాఫీగానే సాగింది.కానీ రోజురోజుకు శైలజ తన మరిది శ్రీకాంత్ కు దగ్గరవుతూ ఏకంగా అక్రమ సంబంధం పెట్టుకుంది.

కొంతకాలం పాటు వీరి చీకటి కాపురం కొనసాగింది.
భార్య అక్రమ సంబంధం భర్త బాలకృష్ణకు తెలియడంతో భార్యతో పాటు తమ్ముడికి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

ఆ తర్వాత వదిన-మరిది మధ్య దూరం కాస్త పెరిగింది.మరిదికి దూరంగా ఉండడం శైలజకు ఇష్టం లేకపోవడంతో ఏకంగా భర్తనే చంపాలనుకుంది.మరిదితో కలిసి మాస్టర్ ప్లాన్ వేసి బాలకృష్ణను కరెంటు షాక్( Current Shock ) తో చంపాలని, బాలకృష్ణ రోజు పొలానికి వెళ్లే దారిలో కరెంట్ వైర్లు కనిపించకుండా భూమి లోపల పాతారు.

బాలకృష్ణ పొలం నుండి నడుచుకుంటూ వస్తుండగా, ఏదో అనుమానం వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించగా పెను ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.ఈ విషయం ఇంట్లో తెలియడంతో వదిన-మరిది లు ఇంట్లో నుంచి పరారయ్యారు.భర్త బాలకృష్ణ తన భార్య, తన తమ్ముడు శ్రీకాంత్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు( Police ) కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజాలు బయట పడ్డాయి.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

శైలజకు తగిన శాస్తి జరిగింది అంటూ, కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube