యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) అకస్మాత్తుగా కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు.వార్2 లో తారక్( War 2 ) నటిస్తుండటంతో సంతోషించాలో, షాకవ్వాలో ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు.అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి షాకింగ్ ట్విస్టులు చోటు చేసుకున్నాయని ప్రభాస్ ( Prabhas ) స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేరారని తెలుస్తోంది.వార్ ఫస్ట్ పార్ట్ కు సిద్దార్థ్ ఆనంద్ దర్శకుడు కాగా యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.
మరోవైపు కొన్నిరోజుల క్రితం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రభాస్ సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో ఒక సినిమాను ప్లాన్ చేయడం జరిగింది.అయితే ఈ సినిమాను మైత్రీ నిర్మాతలు హృతిక్ ప్రభాస్ కాంబోలో వార్2 గా తెరకెక్కించాలని అనుకున్నారు.
అయితే వార్ సినిమాను నిర్మించింది యశ్ రాజ్ బ్యానర్ నిర్మాతలు కావడంతో సిద్దార్థ్ ఆనంద్ మరో బ్యానర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యశ్ రాజ్ బ్యానర్ నిర్మాతలు వార్2 ను ప్రకటించారు.

మైత్రీ నిర్మాతలు ప్రభాస్ ను ఎంపిక చేయాలని భావించిన రోల్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేరారు.అయితే మరో ట్విస్ట్ ఏంటంటే ఎన్టీఆర్ మైత్రీ నిర్మాతల మధ్య మంచి అనుబంధం ఉంది.ఈ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాకు కూడా నిర్మాతలు మైత్రీ నిర్మాతలు కావడం గమనార్హం.

వార్2 ప్రాజెక్ట్ ప్రకటనతో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎవరో ఒకరు పూర్తిస్థాయిలో స్పష్టత ఇస్తే బాగుంటుందని చెప్పవచ్చు.వార్2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం మాత్రం గ్యారంటీ అని చెప్పవచ్చు.







