ఈ ఐపీఎల్ సీజన్ -16 లో( IPL 16 ) యువ ఆటగాళ్లు జోరు కొనసాగిస్తూ కోట్లు పలికిన ప్లేయర్లను సైతం వెనక్కి నెట్టేస్తున్నారు.భవిష్యత్తులో భారత జట్టులో స్థానం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
బ్యాటింగ్ లోను.బౌలింగ్ లోను యువ ఆటగాళ్లు తగ్గేదేలే అంటూ తమ సత్తాను చాటుతున్నారు.
ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ( Tilak Varma ) 84 పరుగులతో అందరిని ఆకట్టుకున్నాడు.ఇక గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్( Sai Sudarshan ) 48 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్ లతో 62 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచి అందరి దృష్టిలో పడ్డాడు.
ప్రస్తుతం ప్రముఖుల నుండి ప్రశంసలు పొందుతున్నాడు.

ఐపీఎల్ సీజన్లో తిలక్ వర్మ, సాయి సుదర్శన్ ప్రత్యేకంగా నిలిచారు.ఇటీవలే జరిగిన ఢిల్లీ- గుజరాత్ మధ్య మ్యాచ్లో అద్భుత ఆటను ప్రదర్శించాడు సాయి సుదర్శన్.తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకొని, ప్రత్యర్థి జట్టు బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని 62 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచి గుజరాత్ గెలుపు జట్టులో భాగస్వామి అయ్యాడు.తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ గత ఏడాది దేశవాళీ మ్యాచ్లలో అద్భుత ఆటను ప్రదర్శించడంతో గుజరాత్ జట్టు వేలంలో రూ.20 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది.

ప్రస్తుతం కోట్లు తీసుకున్న ఆటగాళ్లు కూడా సుదర్శన్ ఆట ముందు పనికిరారు.చాలా అద్భుతంగా ఆడాడంటూ భారత మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు.కచ్చితంగా భవిష్యత్తు కాలంలో అంతర్జాతీయ స్థాయిలో ఆడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటాడని గవాస్కర్ తెలిపాడు.మరొకవైపు అనిల్ కుంబ్లే కూడా సాయి సుదర్శన్ బ్యాటింగ్ ప్రదర్శనను కొనియాడాడు.
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ఆడిన రెండు మ్యాచ్లలో విజయం సాధించి లీగ్ టేబుల్ లో మొదటి స్థానంలో నిలిచింది.







