పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్’ (Adipurush) ఒకటి.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.
ఎందుకంటే ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కింది.మరి అందుకే డార్లింగ్ ఫ్యాన్స్ కాస్తంత ఎక్కువుగానే ఈ సినిమా మీద ద్రుష్టి పెట్టారు.
కానీ మేకర్స్ చూస్తుంటే మాత్రం ఫ్యాన్స్ కు ఉన్నంత టెన్షన్ లో సగం కూడా కనిపించడం లేదు.
ఫ్యాన్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా నుండి సరైన అప్డేట్స్ ను టైం టు టైం అందించడంలో విఫలం అవుతున్నారు.
అప్పుడే ఏప్రిల్ నెల కూడా స్టార్ట్ అయ్యి గడిచిపోతూనే ఉంది.కానీ ప్రభాస్ మేకర్స్ మాత్రం ప్రమోషన్స్ ఇంకా చురుకుగా చేయడం లేదు.జూన్ లో రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియన్ మూవీకి కావాల్సిన ప్రమోషన్స్ ను ఈ సినిమా మేకర్స్ చేయలేక పోతున్నారు.

జనవరిలోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా జూన్ 16న వాయిదా వేశారు.మరి ఇప్పుడైనా ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కు నచ్చే విధంగా సినిమా ప్రమోషన్స్ ఇవ్వలేక పోవడంతో టెన్షన్ రోజురోజుకూ పెరిగి పోతుంది.ఈ మధ్యనే శ్రీరామనవమి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసారు.
అయితే వీటిపై కూడా ఫ్యాన్స్ లో పెద్దగా పాజిటివ్ స్పందన అయితే రాలేదనే చెప్పాలి.

ఇక రేపు హనుమాన్ జయంతి( Hanuman Jayanthi ) కారణంగా ఈ సినిమా నుండి ఏదైనా హనుమంతుడికి సంబంధించిన పవర్ ఫుల్ పోస్టర్ లేదా స్పెషల్ అప్డేట్ ను రిలీజ్ చేస్తారా చేయరా అని ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించగా టి సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించింది.
అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.
చూడాలి మరి రేపు ఈ మూవీ నుండి అప్డేట్ ఇస్తారో లేదో.







