బలగం( Balagam ) సినిమా ను గ్రామ గ్రామంలో బిగ్ స్క్రీన్స్ పై స్క్రీనింగ్ చేయడం ను వ్యతిరేకిస్తూ దిల్ రాజు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు అంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.ఉచితంగా ప్రదర్శణ చేయడం వల్ల తాము నష్టపోతున్నాం అంటూ దిల్ రాజు( Dil Raju ) పేర్కొన్నాడని కూడా ప్రచారం జరిగింది.
అయితే తాను ఏమీ అలా ఫిర్యాదు చేయలేదు అంటూ దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.ఇప్పటి వరకు జనాల్లోకి మా సినిమా బలగం వెళ్తున్న తీరుకు.
సినిమా ను చూసి జనాలు మారుతున్న తీరుకు మాకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.

సినిమాను జనాలు ఆధరిస్తే మాకు అంతకు మించి సంతోషం ఏముందని కూడా ఈ సందర్భంగా దిల్ రాజు అన్నాడు.అయితే గ్రామాల్లో స్క్రీనింగ్ విషయం లో తమ పై జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఆయన అన్నాడు.అయితే అమెజాన్ వారు మాత్రం మా పై ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నాడు.
అమెజాన్ వారికి( Amazon Prime ) మేము రైట్స్ ను ఇవ్వడం జరిగింది.

అలా చేయడం వల్ల వారు ప్రీ గా స్క్రీనింగ్ చేస్తూ ఉంటే వారు తమ పై ఒత్తిడి తీసుకు వస్తున్నారని దిల్ రాజు పేర్కొన్నాడు.తాము గ్రామాల్లో స్క్రీనింగ్ ను అడ్డుకోవడం లేదని.గ్రామాల్లో ఎక్కువ శాతం మంది సినిమాకు రీచ్ అయితే మంచిది అనే ఉద్దేశ్యంతో ఎక్కువ శాతం మందికి చేరువ అవ్వాలనే ఉద్దేశ్యంతో సినిమాను త్వరగా ఓటీటీ ద్వారా తీసుకు వచ్చాం అని కూడా దిల్ రాజు పేర్కొన్నాడు.
మొత్తానికి బలగం విషయంలో దిల్ రాజు క్లారిటీ ఇవ్వడంతో అమెజాన్ ప్రైమ్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.సోషల్ మీడియాలో దిల్ రాజు గురించి కొందరు తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది.
ఇప్పుడు ఆయన వివరణ ఇవ్వడంతో కాస్త క్లారిటీ వచ్చినట్లు అయింది.







