Dussehra : దసరా సినిమాను చేతులారా వదిలేసినా స్టార్ హీరో ఎవరో తెలుసా ?

మార్చి నెలాఖరున వచ్చిన నాని( Nani ) కొత్త సినిమా దసరా హవా మామూలుగా లేదు.ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా కూడా దసరా గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు.

 Who Is That Hero Rejected Dasara Movie-TeluguStop.com

పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతుందనుకున్న ఈ సినిమా అంచనాలు కొంత తలకిందులు అయినప్పటికీ భారీ విజయాన్ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.మొదటి రోజు నుంచి వస్తున్న టాక్ తో చిత్రం యూనిట్ కూడా సంబరాల్లో మునిగి తేలుతోంది.

ఈ సినిమాలో నటించిన నాని మరియు కీర్తి సురేష్( Keerthy Suresh ) నటన అద్భుతంగా ఉండడంతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టినట్టుగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.

Telugu Dasara, Keerthy Suresh, Nani, Nithin, Nitin, Ram Charan, Srikanth Odela,

అయితే ఇంత మంచి సినిమా కథ ముందుగా నాని దగ్గరికి వెళ్లలేదు అనే విషయం తాజాగా బయటకు వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమాని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి ఒక్క సినిమా చేస్తే చాలు అనుకోని హీరో ఉండరు.ఇక సుకుమార్( Sukumar ) శిష్యుడుగా ఉన్న శ్రీకాంత్ ఓదెల ఈ కథకు మొదటగా రామ్ చరణ్( Ram Charan ) అయితే బాగుంటుందని అనుకున్నాడట.

కానీ సినిమా కథ పూర్తి చేసుకున్న తర్వాత అంత పెద్ద హీరోని హ్యాండిల్ చేయగలనా లేదా అని అనుమానం వచ్చి రామ్ చరణ్ దగ్గరికి వెళ్లి కథ చెప్పలేదట.ఇక తెలంగాణ ప్రాంతీయ చిత్రంగా ఉన్నటువంటి ఈ కథను ఏ హీరో తీస్తే బాగుంటుంది అని అనుమానం శ్రీకాంత్ ఓదెలను బాగా పట్టుకుందట.

Telugu Dasara, Keerthy Suresh, Nani, Nithin, Nitin, Ram Charan, Srikanth Odela,

తెలంగాణ హీరో అయితే తెలంగాణ నేపథ్యమున్న కథకు న్యాయం చేస్తాడని హీరో నితిన్( Nitin ) కలిసి కథ చెప్పాడట.కానీ ఒక కొత్త దర్శకుడు చేతిలో ఉన్న తెలంగాణ కథ ఎలా ఉంటుందో అని అనుమానంతో ఈ కథను రిజెక్ట్ చేశాడట నితిన్.దాంతో శ్రీకాంత్ నానిని అడిగాడట.ప్రోమో ఒకటి చేయించుకుని తీసుకొని రమ్మన్నాడట.అది చూడగానే వెంటనే ఓకే చెప్పేసాడట నాని.ఇక సినిమా విడుదలైన తర్వాత నాని తప్ప మరొక హీరో దసరా సినిమాకి న్యాయం చేయలేడు అన్న విధంగా బాగా సెట్ అయ్యాడు.

ప్రస్తుతం దసరా మిలియన్ మార్క్ దాటి రికార్డు కలెక్షన్స్ అందుకుంటుంది దసరా చిత్రం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube