రంగారెడ్డి జిల్లా తాండూరులో పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో బంద్యప్ప అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన ఫోన్ నుంచి పేపర్ ను లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
సైన్స్ టీచర్ గా పని చేస్తున్న బంద్యప్ప ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం ఆయన ఫోన్ ను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.
క్వశ్చన్ పేపర్ ఎవరెవరికీ పంపించారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ ప్రచారాన్ని విద్యాశాఖ ఖండించింది.
ఈ క్రమంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తాండూరు డీఈవో రేణుకాదేవి తెలిపారు.పేపర్ లీక్ పై ఎలాంటి ఫిర్యాదు రాలేదని వెల్లడించారని సమాచారం.







