నాని (Nani) లేటెస్ట్ గా నటించిన సినిమా ”దసరా”(Dasara).ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా మార్చి 30న పాన్ ఇండియా వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది.
మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ పాన్ ఇండియన్ మూవీ శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుని స్పీడ్ గా దూసుకు పోతుంది.
ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
నాని ధరణి పాత్రలో, కీర్తి వెన్నెల పాత్రలో నటించి ఈ సినిమాను మరో లెవల్ కు చేర్చారు.ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఈ సినిమాపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్టార్ హీరోలు మాత్రమే కాదు చాలా మంది ప్రముఖుల ప్రశంసలు అందుకుని మరింత దూసుకు పోతుంది.

ఇక తాజాగా మన టాలీవుడ్ అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి (Rajamouli) సైతం తనదైన శైలిలో దసరా సినిమాకు రివ్యూ ఇచ్చారు.జక్కన్న సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.డైరెక్టర్ శ్రీకాంత్ ప్రతీ సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా హృద్యంగా తెరకెక్కించారని.
నాని ఇంకా కీర్తి ఇద్దరు కూడా పెర్ఫార్మెన్స్ సూపర్ గా చేసారని ఇంతటి గొప్ప విజయాన్ని అందుకున్న టీమ్ అందరికి ప్రత్యేక అభినందనలు అంటూ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తుంది అనే చెప్పాలి.కేవలం నాలుగు రోజుల్లోనే నాని దసరా ఏకంగా 86 కోట్లు రాబట్టి అందరిని ఆశ్చర్య పరుస్తుంది.ఇక ఈ రోజో రేపో 100 కోట్ల మార్క్ ను రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చూడాలి ఈ సినిమాతో న్యాచురల్ స్టార్ నాని 100 కోట్ల మార్క్ ను టచ్ చేసి టైర్ హీరోల్లోనే రికార్డ్ బ్రేక్ చేస్తాడో లేదో.







