ప్రస్తుతం సమాజంలో వృద్ధాప్యం వచ్చేలోపు ఎంతో కొంత సంపాదిస్తేనే పిల్లలు తమ బాగోగులు చూస్తారు.లేదంటే అస్సలు పట్టించుకోరు అని అనుకుంటే అది పొరపాటే.
వృద్ధాప్యంలో తల్లిదండ్రుల దగ్గర కోట్ల ఆస్తి ఉన్న.ప్రేమ ఆప్యాయతలు లేకపోతే పట్టెడు అన్ననికి కూడా అడుక్కోవలసిన పరిస్థితులు వస్తాయి.
హర్యానాలోని( Haryana ) చర్కీ దాద్రీ జిల్లాలో వృద్ధ దంపతులు ఓ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు.ఆ సూసైడ్ నోట్ వింటే ఆశ్చర్య పోవాల్సిందే.
కోట్ల ఆస్తి ఉంది.తమ మనవడు ఐఏఎస్ అధికారి( IAS ) అయినా పట్టెడు అన్నం పెట్టకుండా కొడుకు కోడలు చిత్రహింసలు పెడుతూ ఉండడంతో వేరే దిక్కు లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన ఆ సూసైడ్ నోట్ అందరిని కన్నీరు పెట్టించింది.
వివరాల్లోకెళితే జగదీష్ చంద్ (78), భగ్లీ (77) అనే దంపతులు బధ్రా నగర సమీపంలోని గోపి గ్రామంలో( Gopi Village ) నివాసం ఉంటున్నారు.వీరికి బధ్రా నగరంలో దాదాపు రూ.30 కోట్ల ఆస్తి ఉంది.పైగా మనువడు ఐఏఎస్ ఆఫీసర్.
కానీ కొడుకు కోడలు సరైన ఆహారం ఇవ్వకుండా.పాడైన ఆహారం ఇస్తూ హీనంగా చూడడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అంతేకాకుండా టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.తమపై పలుమార్లు అఘాయిత్యాలకు పాల్పడడం, హీనంగా అవమానించడం, తినడానికి తిండి కూడా పెట్టకపోవడం వల్ల తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని, తన కొడుకు కోడలు శిక్షించి, తన ఆస్తి మొత్తం ఆర్య సమాజ్ కు విరాళంగా ఇవ్వాలని ఆ లెటర్లో జగదీష్ చంద్ పేర్కొన్నాడు.
తమ కడుపున పుట్టిన పిల్లలే తమను అవమానించారని.తమ చావుకు నీలం, వికాస్, సునీత, వీరేందర్ బాధ్యులని సూసైడ్ నోట్లో ప్రస్తావించారు.ప్రభుత్వం తమ పిల్లలను కఠినంగా శిక్షించాలని అప్పుడే తమ ఆత్మకు శాంతి చేకూరుతుందని, ప్రపంచంలో ఏ పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను ఇంత హీనంగా చూసి ఉండరని జగదీష్ చంద్ ఆ సూసైడ్ నోట్లో వెల్లడించాడు.పోలీసులు ఈ వృద్ధ దంపతుల ఆత్మహత్యకు కారణమైన నలుగురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.