నాని( Nani ) హీరోగా వచ్చిన దసర సినిమా( Dasara ) మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా ద్వారా నాని తన కెరియర్ లోనే చాలా పెద్ద హిట్ కొట్టాడు…దీంతో నాని మార్కెట్ భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే నాని ఇక మీదట చేయబోయే ప్రాజెక్టుల విషయం లో చాలా జాగ్రత్త గా ఉంటున్నట్టు తెలుస్తుంది ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ ని చూస్తుంటే ఇప్పటికే ఇది బ్రేక్ ఈవెన్ అయినట్టు గా తెలుస్తుంది.

ఈ సినిమా చూసిన జనాలు సినిమా మీద వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ నాని ని ఈ రేంజ్ మాస్ సినిమాలో చూడడం నిజం గా సంతోషం అనిపించిందని చెప్పారు.అలాగే నాని ఫ్యాన్స్ అయితే మా హీరో కూడా మాస్ హీరో అయిపోయాడు అంటూ తెగ సంబర పడిపోతున్నారు… నాని మాత్రం ఈ సినిమా మీద మొదటి నుంచే భారీ అంచనాలు పెట్టుకున్నట్టు గా తెలుస్తుంది ఎందుకంటే ఈ సినిమాలో కథ బలం స్ట్రాంగ్ గా ఉండటంతో సినిమా జనాలకి విపరీతం గా నచ్చిందనే చెప్పాలి…

ఇక వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఈ సినిమా తీసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) కి మంచి పేరు వచ్చింది.ఆయన చేసిన ఫస్ట్ సినిమాకే ఇంత మంచి బడ్జెట్ పెట్టీ నాని లాంటి హీరో దొరకడం తో తను కూడ ఎక్కడ రాజీ పడకుండా కథ ని చాలా బాగా చెప్పే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి…ఇక ఈ డైరెక్టర్ కి మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్స్ నుంచి అడ్వాన్సులు కూడా వచ్చినట్టు తెలుస్తుంది…మరి తన నెక్స్ట్ సినిమా ఏ హీరో తో ఏ బ్యానర్ లో చేస్తాడో చూడాలి…








