ఉల్లికోడు, మొగి పురుగుల నుండి వరి పంటను సంరక్షించే పద్ధతులు..!

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన ఆహార పంటగా వరి పంట( rice crop ) సాగులో ఉంది.యాసంగిలో వేసిన వరి ఫైర్లకు ఉల్లికోడు, మొగి పురుగుల( Onion , Mogi worms ) బెడద చాలా ఎక్కువ.

 Methods To Protect Rice Crop From Onion And Mogi Insects , Rice Crop, Mogi Insec-TeluguStop.com

వరి పైర్లు చిరు పొట్ట దశలో ఉన్నప్పుడు ఇవి పంటను ఆశిస్తాయి.కాబట్టి వీటి ఉనికిని గుర్తించి వీటిని నివారణ కోసం కొన్ని యాజమాన్య పద్ధతులు క్రమంగా చేపట్టి అరికట్టాల్సి ఉంటుంది.

మొగి పురుగులు ముదురు గోధుమ రంగులో ఉండి ముందు ఉండే రెక్కలు నల్లటి మచ్చలు కలిగి ఉంటాయి.ఇవి ఆకు కొనలలో గుడ్లు పెట్టి వీటి ఉద్ధృతిని పెంచుకొని, మొక్కలు పిలక దశలో ఉన్నప్పుడే వీటి ప్రభావంతో మొవ్వలు ఎండి చనిపోతాయి.

గింజలు అన్నీ తాలుగింజలుగా మారుతాయి.

కాబట్టి ఈ పురుగుల బెడద లేకుండా ఉండాలంటే కాస్త ఆలస్యంగా లేదా ముదిరిన నారును నాటుకోవాలి.నత్రజనికి సంబంధించిన ఎరువులను తక్కువ మోతాదులో ఉపయోగించాలి.పొలంలో అక్కడక్కడ లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి వీటి ఉనికిని గుర్తించాలి.

నారు నాటేటప్పుడు మొక్క కొనలను తుంచి నాటుకోవాలి.నారు నాటిన 15 రోజుల తర్వాత ఎకరం పొలంలో పది కిలోల కార్బో ప్యూరాన్ 3G గుళికలు వేయాలి.వీటి ఉద్ధృతి పెరిగితే లీటరు నీటిలో 1.5 గ్రా.ఎసిఫెట్ కలిపి పిచికారి చేసుకోవాలి.

ఉల్లి కోడు పురుగులు( Onion weevils ) ఎరుపు రంగుతో ఉండి ఇటుక రంగు వర్ణం లో దోమ ఆకారం పోలి ఉంటాయి.ఇవి ఆకుల అడుగు బాగాన గుడ్లు పెట్టి వృద్ధి చెందుతాయి.తర్వాత కాండం తోలుచుకుని, అంకురం ఉల్లి బొందు లాగా మార్పు చెందుతుంది.

మొక్క పెరుగుతూ ఉల్లి గొట్టంగా మారుతుంది.నారు మొలకెత్తిన 15 రోజులలోపు ఎకరం పొలంలో ఎనిమిది వందల గ్రాముల కార్బో ఫ్యురాన్ 3జి గుళికలు వేయాలి.ఒక లీటరు నీటిలో ఫిప్రోనిల్ 5 SC 2.5 మిల్లీలీటర్లు కలిపి పంటకు పిచికారి చేయాలి.పురుగులను పంట చిరు పొట్ట దశకు రాకముందే అరికట్టాలి.తరువాత వీటిని నివారించడం కష్టం.ఎప్పటికప్పుడు పంటను గమనించి సంరక్షణ చర్యలు చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube