మైనర్ బాలికతో ఆర్టీసీ డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన.. దేహశుద్ధి చేసిన ప్రయాణికులు..!

ఇటీవలే కాలంలో కామాంధుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.వయసుతో పని లేకుండా కంటికి నచ్చితే చాలు, ఎలాగోలా తమ కామ కోరికలు తీర్చుకోవడం కోసం విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ.

 Srikalahasthi Rtc Driver Arrested For Harassing Minor Girl Details, Srikalahasth-TeluguStop.com

మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నారు.ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ఎన్ని ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేసిన.

ఎన్ని కట్టిన శిక్షలు అమలు పరచిన సమాజంలోని కామాంధులలో మార్పు మాత్రం శూన్యం.ప్రస్తుత రోజుల్లో స్కూల్ కు వెళ్లే మైనర్ పిల్లలపై.

కమాంధుల ఆగడాలు మితిమీరుతున్నాయి.ఇలాంటి కోవకు చెందిన ఒక ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే శ్రీకాళహస్తి ( Srikalahasthi ) ఆర్టీసీ డిపోలో శ్రీనివాసులు ( Srinivasulu ) అనే 46 ఏళ్ల వ్యక్తి డ్రైవర్ గా( RTC Driver ) విధులు నిర్వహిస్తున్నాడు.అయితే బస్సులో రోజు స్కూలుకు వెళ్లే ఓ మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ అసభ్యంగా ప్రవర్తించాడు.

దీనితో బస్సులో ప్రయాణించే ప్రయాణికులంతా డ్రైవర్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Telugu Minor, Passangers, Rtc, Rtc Srinivasulu, Srikalahasthi-Latest News - Telu

పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.ప్రతిరోజు స్కూలుకు వెళ్లే మైనర్ పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తూ మాయ మాటలు చెప్పి దగ్గరయ్యాడు.విద్యార్థినులతో కాస్త పరిచయం పెరిగాక మచ్చిక చేసుకుని అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు.

ఇంకా ఈ అసభ్యకర సంఘటనలు సెల్ ఫోన్ లో ఫోటోలు తీసి ఆనందించేవాడు.

Telugu Minor, Passangers, Rtc, Rtc Srinivasulu, Srikalahasthi-Latest News - Telu

ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం తంగేళ్ళపాళ్యం తమిళ మీడియం హైస్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక అరిగళ్ళ కండ్రిగ ను మచ్చిక చేసుకుని దగ్గరయ్యాడు.బస్సులో అందరూ చూస్తుండగానే ఆ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో.కూతురు వయసున్న అమ్మాయితో ఇలా అసభ్యకరంగా ప్రవర్తిస్తావా అంటూ ప్రయాణికులంతా డ్రైవర్ శ్రీనివాసులు కు దేహశుద్ధి చేశారు.

ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో.బాలిక తండ్రి బుచ్చినాయుడు కండ్రిగ ఇచ్చిన ఫిర్యాదుతో ఫోక్సో చట్టం కింద శ్రీనివాసులు పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube