అప్పుడప్పుడు నెటిజన్స్ సెలబ్రెటీలకు సవాల్ విసురుతూ ఉంటారు.ఏదో ఒక విషయం గురించి వారిని గట్టిగా టార్గెట్ చేస్తూ ఉంటారు.
ఒకప్పుడు సెలబ్రెటీలకు, సామాన్యులకు మధ్య కమ్యూనికేషన్ అసలు లేకుండా పోయేది.కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో అప్పటినుంచి కమ్యూనికేషన్ బాగా పెరిగిపోయింది.
ఏది ఉన్న సామాన్యులు వెంటనే సెలబ్రిటీలను ప్రశ్నలతో కడిగి పారేస్తున్నారు.అంతేకాకుండా మంచి కమ్యూనికేషన్ కూడా పెంచుకుంటున్నారు.
అప్పుడప్పుడు బాగా టార్గెట్ చేస్తూ సవాల్ కూడా విసురుతున్నారు.అయితే తాజాగా హీరోయిన్ శ్రీ లీలపై( Sri Leela ) కూడా ఓ నెటిజన్ సవాల్ విసిరారు.
ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.
ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్రాళ్ళ మదిలో క్రష్ గా నిలిచిన బ్యూటీ శ్రీ లీల అని చెప్పాలి.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తుంది.కేవలం ప్రేక్షకులను కాకుండా స్టార్ హీరోలను సైతం తన అందాలతో పడేసింది.అలా అతి తక్కువ సమయంలో మంచి అభిమానం ను పెంచుకుంది.సినీ ఇండస్ట్రీకి చిన్నవయసులోనే హీరోయిన్ గా పరిచయమైంది శ్రీ లీల.ఏకంగా రెండవ సినిమాతోనే స్టార్ క్రేజ్ సంపాదించుకుంది.తొలిసారిగా ముద్దు అనే కన్నడ( Kannada ) సినిమాతో 2019లో అడుగు పెట్టగా.
ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యింది.ఇక 2021 లో పెళ్లి సందD సినిమాలో నటించి తన తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది.
ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

ఇక గత ఏడాది మాస్ మహారాజ్ రవితేజ( Mass Maharaj Ravi Teja ) నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.అంతేకాకుండా భారీ అవకాశాలు కూడా అందుకుంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి శ్రీ లీల సోషల్ మీడియాలో కూడా బాగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది.
నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటుంది.ఇక చూడటానికి చాలా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మకు కుర్రాళ్ళు ఫిదా అవుతూ ఉంటారు.ఈమె ఏదైనా ఫోటో పెడితే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫోటోలు పంచుకుంది.
అందులో ట్రెడిషనల్ లుక్ లో తన అందంతో మరింత ఫిదా చేసింది.ఇక ఆ ఫోటోలు చూసి తన అభిమానులు బాగా లైక్స్ కొడుతున్నారు.

అంతేకాకుండా తన అందాన్ని కామెంట్ల రూపంలో పొగుడుతున్నారు.కానీ ఓ నెటిజన్ మాత్రం ఆమెపై సవాలు విసిరారు.మీ పోస్ట్ లకు లైక్ మేము కొట్టడం కాదు దమ్ము ఉంటే మీరు మా పోస్ట్ లకు లైక్ కొట్టు అంటూ సవాల్ విసిరారు.దీంతో ఈ కామెంట్ కు మరికొంతమంది కూడా అవును అంటూ సమాధానం ఇస్తున్నారు.
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.







