Desamuduru 4K : బన్నీ దేశముదురు 4కే ట్రైలర్ రిలీజ్.. మామూలుగా లేదుగా?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అల్లు అర్జున్( Allu arjun, ) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఈ నెల అనగా ఏప్రిల్ 17న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ నటించిన దేశముదురు( Desha muduru ) సినిమాను రీ రిలీజ్ చేస్తారా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.నిన్న మొన్నటి వరకు కూడా ఈ సినిమాను రీరిలీజ్ చేస్తారో లేదో అని అభిమానులు కంగారు పడ్డారు.కానీ తాజాగా విడుదల చేసిన అప్డేట్ తో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

వారి అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.ది మోస్ట్ అవేటింగ్‌ రీ రిలీజింగ్ ఫిల్మ్ దేశముదురు 4కే ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతూ రికార్డ్ స్థాయిలో వ్యూస్ ని రాబడుతోంది.

పూరి జగన్నాథ్( Puri Jagannadh ) దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ దేశముదురు సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.దీంతో ఈనెల 17వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మరోసారి రీ రిలీజ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.ఇక అభిమానుల డిమాండ్ మేరకు ఓకే చెప్పిన ప్రొడ్యూసర్ దానయ్య తాజాగా సినిమా రీ రిలీజ్ చేసేందుకు రెడ్డి అయ్యి 4కే ప్రాసెసింగ్ చేయించారు.

తాజాగా ఈ సినిమా 4కే ట్రైలర్ ని అఫీషియల్ గా విడుదల చేశారు దానయ్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube