బిజీ లైఫ్ స్టైల్, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టక( Sleep ) ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంతగానో సతమతం అవుతున్నారు.ఈ క్రమంలోనే కొందరు నిద్రమాత్రలకు అలవాటు పడుతున్నారు.
కానీ స్లీపింగ్ పిల్స్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.స్లీపింగ్ పిల్స్( Sleeping pills ) వాడటం వల్ల అంతర్గత అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది.
అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి.అందుకే సహజంగానే ప్రశాంతమైన నిద్రను పొందడానికి ప్రయత్నించాలి.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
రోజు నైట్ ఈ ఒక్క డ్రింక్ ను తీసుకుంటే వద్దన్నా నిద్ర ముంచుకొస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఎనమిది నుంచి పన్నెండు బాదం పప్పులు( Almonds ) వేసి వాటర్ పోసి పది గంటలపాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న బాదం పప్పు పొట్టు తొలగించి వేసుకోవాలి.
అలాగే రెండు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి కొద్దిగా వాటర్ పోసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో అర అంగుళం పొట్టు తొలగించి దంచిన పచ్చి పసుపు కొమ్ము, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అంగుళం దాల్చిన చెక్క వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఇలా మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఆపై ఈ వాటర్ ను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం మిశ్రమంలో వేసి బాగా షేక్ చేయాలి.అంతే మన డ్రింక్ సిద్ధం అయినట్లే.
రోజు నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ డ్రింక్ ను సేవించాలి.ఈ టర్మరిక్ బాదం మిల్క్( Turmeric Almond Milk ) రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ముఖ్యంగా ఈ డ్రింక్ ను రెగ్యులర్ గా తీసుకుంటే నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.ప్రశాంతమైన మరియు సుఖమైన నిద్ర మీ సొంతమవుతుంది.