ఎన్టీఆర్‌30 సినిమాలో సెకండ్ హీరోయిన్‌ పాత్ర వార్తలపై నిజం ఎంత?

యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్(Janhvi Kapoor ) నటిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల జరిగిన పూజ కార్యక్రమాలతో ఆమె హాజరయింది.

 Second Heroine In Ntr And Koratala Siva Movie Ntr30,ntr30,junior Ntr,koratala Si-TeluguStop.com

షూటింగ్ ప్రారంభానికి ముందే ఎన్టీఆర్ మరియు జాన్వీ లపై ఫోటో షూట్ నిర్వహించారు.ఇద్దరి కాంబినేషన్ పై ప్రేక్షకులు మరియు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

తప్పకుండా వీరిద్దరి కాంబినేషన్ లో మంచి సినిమాగా ఇది నిలుస్తుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడిగా ఈ సినిమా లో మరో హీరోయిన్ గా ప్రముఖ తమిళ హీరోయిన్(Tamil Heroine ) నటించబోతుందనే ప్రచారం జరుగుతుంది.ఆమె ను ఈ సినిమా కోసం సంప్రదించారని భారీ పారితోషికానికి ఆమె ఓకే చెప్పిందని కూడా సమాచారం అందుతుంది.ఈ మధ్య కాలంలో తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న ఆమె తెలుగు లో బిజీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తుందట.

తాజాగా ఎన్టీఆర్ సినిమాలో అవకాశం రావడంతో సెకండ్ హీరోయిన్ పాత్ర అయినా కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది.

కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో గతంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్(Janata Garage ) సినిమా లో కూడా ఇద్దరు హీరోయిన్స్ నటించిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్ కనిపించబోతున్నారని సమాచారం అందుతుంది.కొందరు మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు.

సోషల్ మీడియా( Social Media 0 లో వచ్చిన వార్తలు నిజం కాదని ఈ సినిమా కథ లో భాగంగా కేవలం ఒకే ఒక్క హీరోయిన్ ఉంటుందని అంటున్నారు.కొరటాల శివ ఏ హీరోయిన్ తో కూడా సంప్రదింపులు జరపలేదని కూడా వారు పేర్కొన్నారు.

ఎన్టీఆర్ కి జోడిగా ఒక హీరోయిన్ అయితే సరి పోతుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అసలు విషయం ఏంటి అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube