ఎన్టీఆర్30 సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర వార్తలపై నిజం ఎంత?
TeluguStop.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్(Janhvi Kapoor ) నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల జరిగిన పూజ కార్యక్రమాలతో ఆమె హాజరయింది.షూటింగ్ ప్రారంభానికి ముందే ఎన్టీఆర్ మరియు జాన్వీ లపై ఫోటో షూట్ నిర్వహించారు.
ఇద్దరి కాంబినేషన్ పై ప్రేక్షకులు మరియు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.తప్పకుండా వీరిద్దరి కాంబినేషన్ లో మంచి సినిమాగా ఇది నిలుస్తుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
"""/"/
ఇదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడిగా ఈ సినిమా లో మరో హీరోయిన్ గా ప్రముఖ తమిళ హీరోయిన్(Tamil Heroine ) నటించబోతుందనే ప్రచారం జరుగుతుంది.
ఆమె ను ఈ సినిమా కోసం సంప్రదించారని భారీ పారితోషికానికి ఆమె ఓకే చెప్పిందని కూడా సమాచారం అందుతుంది.
ఈ మధ్య కాలంలో తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న ఆమె తెలుగు లో బిజీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తుందట.
తాజాగా ఎన్టీఆర్ సినిమాలో అవకాశం రావడంతో సెకండ్ హీరోయిన్ పాత్ర అయినా కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది.
"""/"/
కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో గతంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్(Janata Garage ) సినిమా లో కూడా ఇద్దరు హీరోయిన్స్ నటించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్ కనిపించబోతున్నారని సమాచారం అందుతుంది.కొందరు మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు.
సోషల్ మీడియా( Social Media 0 లో వచ్చిన వార్తలు నిజం కాదని ఈ సినిమా కథ లో భాగంగా కేవలం ఒకే ఒక్క హీరోయిన్ ఉంటుందని అంటున్నారు.
కొరటాల శివ ఏ హీరోయిన్ తో కూడా సంప్రదింపులు జరపలేదని కూడా వారు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ కి జోడిగా ఒక హీరోయిన్ అయితే సరి పోతుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయం ఏంటి అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమాలో మలయాళం స్టార్ హీరో నటిస్తున్నాడా..?