Director Srikanth Odela: బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీకాంత్ ఓదెల.. ఆ స్టార్ హీరోతో సినిమా?

టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా.( Dasara ) ఇటీవల మార్చి 30వ తేదీన శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.

 Dasara Movie Director Srikanth Odela Got Great Offer From Star Actor-TeluguStop.com

శ్రీకాంత్ ఓదెల( Director Srikanth Odela ) దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది.

రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డు స్థాయి వసూళ్లతో దుమ్మురేపుతోంది.సినిమా రిలీజైన రెండు రోజుల్లోనే రూ.53 కోట్ల మార్కును అందుకుని చరిత్ర సృష్టించింది.

అంతేకాకుండా నాని ( Nani ) కెరీర్​లోనే బిగ్గెస్ట్ హిట్​ సినిమాగా నిలిచింది.ఫుల్​ రన్​లో ఈ సినిమా రూ.100 కోట్ల పైచిలుకు కలెక్షన్స్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం చిత్ర బృందం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.సినిమాలో నటనకు గాను కీర్తి సురేష్ నానికి మంచి మార్కులే పడ్డాయి.అంతేకాకుండా దర్శకుడు శ్రీకాంత్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు అలాగే సెలబ్రిటీలు.మరి ముఖ్యంగా డైరెక్టర్ శ్రీకాంత్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా దసరా సినిమాను మహేష్ బాబు చూశారు.ఈ సినిమాను చూసిన తర్వాత మహేష్ బాబు సినిమా గురించి స్పందిస్తూ.

Telugu Dasara, Keerthy Suresh, Mahesh Babu, Nani, Srikanth Odela, Srikanthodela-

దసరా మూవీ విషయంలో ఎంతో గర్విస్తున్నాను.ఇది అద్భుతమైన సినిమా అని మహేష్ తన ట్వీట్ తెలిపారు.దీంతో చిత్ర యూనిట్ సంతోషంలో మునిగిపోయింది.మహేష్ లాంటి స్టార్ హీరో తమ మూవీ పై ట్వీట్ చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పనితీరు మహేష్ బాబుకు బాగా నచ్చిందని,

Telugu Dasara, Keerthy Suresh, Mahesh Babu, Nani, Srikanth Odela, Srikanthodela-

దానితో సూపర్ స్టార్ రాజమౌళి సినిమా తర్వాత శ్రీకాంత్ తో ఒక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న మహేష్ బాబు ఈ సినిమా పూర్తవుగానే రాజమౌళి సినిమాలో నటించనున్నారు.అనంతరం రాజమౌళి ప్రాజెక్టు తర్వాత శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయం పై మహేష్ బాబు కానీ దర్శకుడు శ్రీకాంత్ కానీ ఇంతవరకు స్పందించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube