నగ్మాతో ఎఫైర్ గురించి నోరు విప్పిన రవికిషన్.. కాళ్లకు నమస్కరించానంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న రవికిషన్( Ravikishan ) వ్యక్తిగత జీవితం గురించి అభిమానులకు ఎక్కువగా తెలియదు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో రవికిషన్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

 Ravikishan Comments Goes Viral In Social Media Details Here ,ravikishan,ravikis-TeluguStop.com

రవికిషన్ కు నగ్మాతో( Nagma ) ఎఫైర్ ఉందని కూడా గతంలో వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే.

రవికిషన్ మాట్లాడుతూ నగ్మాతో కలిసి నేను ఎక్కువ సినిమాలలో నటించానని ఈ రీజన్ వల్లే అలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయని తెలిపారు.

నగ్మాతో కలిసి నేను చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.నగ్మా, నేను మంచి ఫ్రెండ్స్ అని ఆ రీజన్ వల్లే మేమిద్దరం ఎక్కువ సినిమాలు చేయడం సాధ్యమైందని ఆయన చెప్పుకొచ్చారు.

నాకు పెళ్లైందనే విషయం కూడా అందరికీ తెలుసని రవికిషన్ కామెంట్లు చేశారు.

నా భార్య పేరు ప్రీతి శుక్లా( Preeti Shukla ) అని ఆమె అంటే నాకు ఎంతో గౌరవమని ఆయన తెలిపారు.నా భార్య పాదాలకు నేను నమస్కరిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.నా దగ్గర డబ్బులు లేని సమయంలో కూడా ఆమె నాతో ఉందని రవికిషన్ కామెంట్లు చేశారు.

నాకు స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనాలని భార్య సూచనలు చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.ఇష్టం లేకపోయినా బిగ్ బాస్ షోకు( Bigg Boss show ) వెళ్లానని ఆయన తెలిపారు.

బిగ్ బాస్ షో వల్ల నాలో చాలా మార్పు వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.ఆ షోకు వెళ్లకముందు నాలో గర్వం ఉండేదని ఆ షో వల్ల నేను పూర్తిగా మారిపోయానని ఆయన తెలిపారు.బిగ్ బాస్ షో వల్ల నేను సాధారణ వ్యక్తిగా మారిపోవడంతో పాటు నా కుటుంబాన్ని బాగా చూసుకున్నానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.రవికిషన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube