ఇన్ని సినిమాలు మధ్యలో వదిలేసి విదేశాలకు అవసరమా పవన్‌?

పవన్‌ కళ్యాణ్‌( Pawan kalyan ) చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి.అందులో హరి హర వీరమల్లు సినిమా మధ్యలో ఉంది.

 Pawan Kalyan Foreign Trip And Fans Unhappy  , Pawan Kalyan , Varahi ,  Foreign T-TeluguStop.com

వినోదయ సీతమ్ సినిమా షూటింగ్ తన టాకీ పార్ట్‌ పూర్తి చేశాడు.ఒకటి లేదా రెండు పాటల చిత్రీకరణ లో పవన్ మరో మూడు నాలుగు రోజుల పాటు పాల్గొనాల్సి ఉంది.

ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) అనే సినిమాను చేయబోతున్నాడు.ఆ సినిమా కోసం సెట్స్ రెడీ అవుతున్నాయి.

ఆ సినిమా చిత్రీకరణ కోసం అంతా ఏర్పాట్లు జరిగాయి.ఈ సమయంలో పవన్ కళ్యాణ్‌ విదేశీ పర్యటనకు వెళ్లడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం బిజీగా ఉండాల్సిన సమయంలో విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.విదేశాలకు పవన్ వెళ్లడం పట్ల జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారట.

Telugu Foreign Trip, Harihara, Janasena, Pawan Kalyan, Tollywood, Top, Ustaadbha

గత కొన్నాళ్లుగా పార్టీని( JanaSena Party ) బలోపేతం చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు.అందులో భాగంగానే పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సిన అవసరం ఉంది.వారాహితో పర్యటించాలని పవన్‌ భావించాడు.ఇప్పటి వరకు అందుకు సంబంధించి ఎలాంటి అప్డేట్‌ లేదు.వారాహి వాహనం లో రాష్ట్రం మొత్తం పర్యటిస్తాను అంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ ఇలా వ్యవహరించడం ఏంటో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.విదేశాల నుండి పవన్‌ కళ్యాణ్ రెండు వారాల తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Telugu Foreign Trip, Harihara, Janasena, Pawan Kalyan, Tollywood, Top, Ustaadbha

విదేశాల్లో పార్టీ కోసం ఫండ్‌ రైజింగ్ కు పవన్ కళ్యాణ్ వెళ్లాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం పవన్‌ కళ్యాణ్‌ విశ్రాంతి కోసం వెళ్లాడు అంటున్నారు.మరి కొందరు ఆయన ఆరోగ్యం సరిగా ఉండటం లేదు.అందుకే ఆయన చికిత్స నిమిత్తం వెళ్లాడు అంటున్నారు.అందుకే పవన్ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.పవన్‌ కళ్యాణ్ యొక్క సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేదు.షూటింగ్స్ మధ్యలో వదిలేసి వెళ్లడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube