ప్రతి నెలా పదుల సంఖ్యలో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి.ఈ మధ్య కాలంలో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తుండగా నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాలు మాత్రం డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నాయి.
మార్చి నెల బాక్సాఫీస్ రివ్యూను( Box Office Review ) పరిశీలిస్తే కేవలం మూడంటే మూడు సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచాయి.
బలగం, దాస్ కా ధమ్కీ, దసరా సినిమాలు మాత్రమే కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.
అయితే ఈ మూడు సినిమాలలో ఏ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలవలేదు.గతేడాది ఇదే సమమయంలో విడుదలైన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.మార్చి నెలలో రిలీజైన సినిమాలలో కొన్ని సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలీదు.

మార్చి నెల ఫస్ట్ వీక్ లో ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, బలగం, గ్రంథాలయం, ఇన్ కార్, రిచి గాడి పెళ్లి సినిమాలు విడుదలయ్యాయి.బలగం( Balagam ) మినహా ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.మార్చి రెండో వారంలో సీ.
ఎస్.ఐ సనాతన్ రిలీజ్ కాగా మిస్టర్ కళ్యాణ్, దోచేవారెవరు సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.మార్చి మూడో వారంలో కబ్జా, ఫలనా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

మార్చి నాలుగో వారంలో రంగమార్తాండ, దాస్ కా ధమ్కీ సినిమాలు రిలీజ్ కాగా దాస్ కా ధమ్కీకి( Das Ka Dhamki ) నెగిటివ్ రివ్యూలు వచ్చినా ఈ సినిమా కమర్షియల్ గా హిట్ గా నిలిచింది.అదే వారం విడుదలైన ఇతర సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి.మార్చి నెల చివరి వారంలో సైతం దసరా ( Dasara ) మినహా మిగతా సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.







