రక్తం చిందించైనా "చిందేపల్లెకు" న్యాయం చేస్తాం - జనసేన పార్టీ చిత్తూరు జిల్లా నేతలు

శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం చిందేపల్లి చుట్టుపక్కల అనేక గ్రామాలకు లింకు రోడ్డుగా ఉండే దానిని ఈసీఎల్ కంపెనీ వారు ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు ముడుపులు చెల్లించి ఆ రహదారిని ఆక్రమించుకొని గోడల నిర్మించి ప్రశ్నించిన గ్రామ ప్రజలపై కొత్త కేసులను పెట్టి దారుణంగా వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇంచార్జ్ లు వినూత , చంద్రబాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, మహిళా నాయకురాలు ఆకేపాటి సుభాషిని, రాజేష్ యాదవ్, కీర్తన, తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ జలియన్వాలాబాగ్ వుదంతాన్ని తలపించేలా

 Janasena Party Chittoor District Leaders Angry On Chindepalle Village Incident,-TeluguStop.com

అప్పుడు తుపాకీ తూటాలు పేలితే ఇప్పుడు చిందేపల్లిలో లాటీలు ఇనుప రాడ్ల తో పోలీసు లు దాడి కి తెగబడ్డారని ఆరోపించారు.

దీనిపై తాము ఆ గ్రామంలోని శివాలయంలో నిరాహార దీక్ష చేస్తుంటే అతి దారుణంగా తమను దేశద్రోహులను అరెస్ట్ చేసినట్లు వాహనాల లో ఎక్కించుకొని ఏర్పేడు గాజుల మన్యం బి ఎన్ కండ్రిగ ఏర్పోర్ట్ రామచంద్రపురం పోలీస్ స్టేషన్ లకు తరలించి అట్టెం టూ మర్డర్ , దేశద్రోహ చట్టం లాంటి కేసులు మోపడం సమంజసమా అని ప్రశ్నించారు.

నేడు ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లకు బదులు వైసీపీ సెక్షన్లు కొనసాగుతున్నాయని విమర్శించారు.

ఈ ఆందోళన పట్ల తమ జనసేనాని పవన్ కళ్యాణ్ తో చర్చించామని అవసరమైతే పవన్ కళ్యాణ్ ఈ గ్రామాల ప్రజల కోసం గోడను బద్దలు కొట్టడానికి ప్రత్యక్షంగా హాజరవుతారని, ఈ రహదారి న్యాయపోరాటంలో తాము ఎమ్మార్వో , కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులను కలిశామని , అయినా గ్రామస్తులకు న్యాయం జరగలేదని… ఈ పెత్తందారుల రాజ్యంలో ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేవుళ్ళ విషయానికొస్తే టీటీడీ నిర్లక్ష్యానికి మూడు కోట్లు పెనాల్టీ విధిస్తే ఆ పరిహారాన్ని ఆ దేవదేవుని ఖాతా ద్వారా చెల్లించడం సమంజసం కాదన్నారు.

సామాన్య భక్తులు ముడుపులుగా చెల్లించిన కానుకులను పరిహారంగా చెల్లించడం మంచిది కాదన్నారు, చేసిన తప్పు కు టీటీడీ పాలక మండలి సభ్యులు నిర్లక్ష్యం ద్వారా వేసిన పెనాల్టీని మొత్తం సమాన భాగాలుగా పంచుకుని మూడు కోట్ల రూపాయలను శ్రీవారి హుండీ ద్వారా జమ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాఘవయ్య, సాయి ప్రసాద్ పార్ధు, ఆదికేశవులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube