నరసింహాచారి దర్శకత్వంలో డా.సకారం మారుతి, భాస్కర్ రెడ్డి, చిత్రం శ్రీను, మీనాక్షి రెడ్డి, పల్సర్ బైక్ ఝాన్సీ( Pulsar Bike Jhansi ) కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం రంగస్వామి( Rangaswamy ).
ఈ సినిమాను డ్రీమ్ పతాకంపై నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాను టాలీవుడ్ నటుడు సుమన్( Actor Suman ) వీక్షించారు.
అనంతరం సుమన్ మాట్లాడుతూ.యువత డ్రగ్స్ ఉపయోగించినప్పుడు ఎంత ఆనందిస్తున్నారో.
ఆ తర్వాత వాటిని ఉపయోగించినందుకు అంతగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఆ విషయాన్ని ఇందులో చక్కగా చూపించారు.
ఈ చిత్రం యువతకు మంచి సందేశాన్ని ఇస్తుంది.

టైలర్ చూసిన తర్వాత ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు అనిపించింది.ఎమోషన్స్ పండించడం చాలా కష్టం.ఈ సినిమాలో దానికే ఎక్కువ మార్కులు పడతాయి.
ఇలాంటి చిత్రంలో నాకు పాత్ర రాలేదని కాస్త బాధగా ఉంది అని తెలిపారు సుమన్.సినిమా చూసిన తర్వాత మైండ్ ఫ్రెష్ అయినట్లు అనిపించింది అని చెప్పకు వచ్చారు.
ఇటువంటి సినిమాలు కథలు రావడం ఈ సమాజానికి చాలా అవసరం అని తెలిపారు సుమన్.అనంతరం నటుడు సకారం మారుతి మాట్లాడుతూ.
దర్శకుడు చెప్పినట్లు చేసాము.మట్టిని పిండి బొమ్మగా మలిచినట్లు మా నుంచి చక్కని నటనను రాబట్టారు.
అ క్రెడిట్ అంతా దర్శకుడిదే.

సినిమాలపై ఎంతో అవగాహన అనుభవం ఉన్న సుమన్ గారు ఈ సినిమాను చూసి ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో మా సినిమాపై నమ్మకం మరింత పెరిగింది.పైగా ఈ సినిమా నచ్చి మా టీం చేసే తదుపరి చిత్రంలో తప్పకుండా అవకాశం ఇవ్వాలని సుమన్ మమ్మల్ని కోరడం చాలా ఆనందంగా అనిపించింది అని చెప్పుకొచ్చారు మారుతి.ఇకపోతే నటుడు సుమన్ విషయానికి వస్తేం.
ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.హీరో సుమన్ కి తెలుగు తో పాటు కన్నడలో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు.
ఇటీవల సుమన్ నటుడిగా 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.అంతే కాకుండా పది భాషల్లో 700 కు పైగా సినిమాలలో నటించారు.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ తమిళ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు సుమన్.హీరో గానే కాకుండా నటుడుగా కూడా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు.
ప్రస్తుతం సుమన్ అడపాదడపా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.







