న్యాచురల్ స్టార్ నాని( Nani ) నేడు దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) అనే నూతన దర్శకుడిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ నాని చేసిన దసరా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
అయితే దసరా సినిమా ప్రమోషన్స్ ని ఈగర్ గా చేసిన నాని సినిమాతో తప్పకుండా హిట్టు కొడుతున్నాం అని చాలాసార్లు చెప్పాడు.అయితే సినిమా తీసిన ప్రతి హీరో ప్రమోషన్స్ లో చెప్పేమాట అదే కదా అని అనుకున్నారు.
కానీ దసరా చూశాక అర్ధమైంది నాని అలా ఎందుకు చెప్పాడో.

చెప్పి మరీ హిట్ కొట్టడం అనేది నానికి అలవాటుగా మారింది.శ్యాం సింగ రాయ్( Shyam Singh Roy ) సినిమా విషయంలో కూడా నాని ఇంతే నమ్మకంగా సినిమా అందరిని అలరిస్తుందని అన్నాడు.ఆ సినిమా కూడా సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది.
ఇక ఇప్పుడు దసరా విషయంలో కూడా అది రిపీట్ అయ్యింది.ముఖ్యంగా ఈ సినిమా నానిలోని ఊర మాస్ యాంగిల్ ని చూసి నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
నాని ఈ డిఫరెంట్ మేకోవర్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.దసరా మొదటిరోజు హడావిడి బాగానే ఉంది వసూళ్లు కూడా మోత మోగించేలా ఉన్నారు.







