ఏపీ సీఎం జగన్( CM Jagan ) ఢిల్లీ పర్యటన పై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.ప్రధాని నరేంద్ర మోది తో( PM Narendra Modi ) భేటీ అయిన జగన్ అనేక రాజకీయ అంశాలపై చర్చించారు.
ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు, ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు, అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి సహకారం, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాల పైన చర్చించారు .నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోను( Amith Sha ) జగన్ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు , ఏపీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల పైన ప్రధానంగా జగన్ చర్చించారు.
పోలవరం ప్రాజెక్టు ను పూర్తి చేస్తానంటూ జగన్ ప్రకటించిన నేపథ్యంలో, కేంద్రం నుంచి నిధులను సాధించేందుకు వరుస వరుసగా కేంద్ర బిజెపి పెద్దలను కలుస్తున్నారు.
తాజాగా అమిత్ షా తో జరిగిన సమావేశంలో పోలవరం అంశంపై ప్రధానంగా చర్చించారు.ఈ ప్రాజెక్టును మరింత వేగవంతం చేసేందుకు పదివేల కోట్లను మంజూరు చేయాలని కోరారు.అలాగే డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలో చేపట్టాల్సిన మరమ్మత్తుల నిమిత్తం రూ.2020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని డీ డీ ఆర్ ఎంపీ అంచనా వేసింది.

ఈ డబ్బులు వెంటనే విడుదల చేయాలని జగన్ కోరారు.అలాగే పోలవరం ప్రాజెక్ట్ అంచనాలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రూ.55,548 కోట్లుగా నిర్ధారించడంతో దానిని విడుదల చేయాలని , అలాగే 2014 – 15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్రానికి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్లు పెండింగ్ లో ఉండడంతో వాటిని విడుదల చేయాలని జగన్ కోరారు.దీంతో పాటు పోలవరం ముంపు బాధితులకు పరిహారం వీలైనంత తొందరగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇక తెలంగాణ నుంచి ఏపీ జెన్కోకు 2014 నుంచి 2017 జూన్ వరకు సరఫరా చేసిన విద్యుత్ కు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉండడంతో వెంటనే వాటిని ఇప్పించాలని అమిత్ షా ను కోరారు.ఇంకా అనేక నిధుల గురించి ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాల గురించి అమిత్ షా తో జగన్ కీలకంగా చర్చించారట.
ఇంకా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.







