చమ్కీల అంగిలేసి పాట( Chamkeela Angeelesi ) గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు.టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటించిన పాన్ ఇండియా చిత్రం ‘దసరా’( Dasara ).
ఈ సినిమాలోదే ఆ పాట.శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచేసింది.సంతోష్ నారాయణన్ విభిన్న ట్రాక్‌లతో కూడిన అద్భుతమైన ఆల్బమ్‌ను స్కోర్ చేశారు.దసరా మూవీలోని మూడో సింగిల్ చమ్కీల అంగీలేసి పాట విడుదలై ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తోందో చెప్పాల్సిన పనిలేదు.
పెళ్లిలో భార్యాభర్తలు పరస్పరం వాదులాడుకునే సొగసైన పాటిది.

ఇందులో భార్య పాత్ర పోషించిన కీర్తి సురేష్( Keerthy Suresh ).తన భర్త ఎలా దుస్తులు ధరించేవాడో, పెళ్లయిన తొలినాళ్లలో ఎలా వుండేవాడో, ఇక పెళ్ళైన తరువాత ఎంత నిర్లక్ష్యంగా మారిపోయాడో చెబుతూ పాడే పాట ఇది.నాని కూడా తన భార్యపై అలాంటి వాదనలే ఈ పాటలో వినిపిస్తాడు.ఇది ప్రతి భార్య భర్త రిలేట్ చేసుకునే పాట కావడంతో సోషల్ మీడియాలో బాగా హిట్టైంది.పైగా తెలంగాణ స్లాంగ్ కావడంతో మరీ ముఖ్యంగా తెలంగాణ వాసులు ఎక్కువగా ఈ పాటను వింటున్నారు.
చమ్కీలా అంగీలేసి పాటలో నాని( Nani ) దసరా బుల్లోడులా కనిపించగా, కీర్తి సురేష్ చీరలో అందంగా కనిపించింది.

‘దసరా’ సినిమా ఈరోజే గ్రాండ్ గా రిలీజ్ అయింది.అనగా మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల అయింది.కాగా ఎవరి నోట విన్నా ఇపుడు ఇదే పాట వినబడుతోంది.
సోషల్ మీడియా( Soical Media )లో అక్కచెల్లెల్లు, అత్తా కోడళ్లు, భార్య భర్తలు వయసుతో సంబంధం లేకుండా ఈ పాటకు డాన్సులు చేస్తున్నారు.అంతేకాకుండా ఈ పాటకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించడంతో ప్రమోషన్ ఈవెంట్లలోనూ నాని, కీర్తి ఇద్దరూ ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తున్నారు.
ఈ క్రమంలోనే కీర్తి తల్లి కూడా ఈ పాటను పాడుతూ తనదైన స్టైల్ లో డాన్సులు వేసారట.







