ఈ ఐపీఎల్ సీజన్లో కామెంట్రీ చెప్పేందుకు స్టీవ్ స్మిత్( Steve Smith ) ఇప్పటికే భారత్ చేరుకున్నాడు.తాజాగా స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో పాల్గొన్న స్టీవ్ స్మిత్ ఈ సీజన్లో పాల్గొనే జట్ల గురించి జోస్యం చెప్పాడు.
ఐపీఎల్ సీజన్ -16 ( IPL Season-16 )టైటిల్ విన్నర్ గుజరాత్ టైటాన్స్( Gujarat Titans ) అయ్యే ఛాన్స్ ఉందని తెలిపాడు.రెండో టైటిల్ గెలిచే సత్తా ఒక్క గుజరాత్ జట్టుకే సొంతం అంటూ, సన్ రైజర్స్ హైదరబాద్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ప్లే-ఆఫ్ కు చేరుతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
స్మిత్ అధికారిక బ్రాండ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తరఫున కామెంటేటర్ గా వ్యాఖ్యానం చేయనున్నాడు.

అంతేకాకుండా ఈ ఐపీఎల్ సీజన్లో లీక్ పాయింట్ల టేబుల్ లో మొదటి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, రెండవ స్థానంలో గుజరాత్, మూడవ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్, నాలుగో స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు నిలుస్తాయని స్టీవ్ స్మిత్ జోస్యం చెప్పాడు.ఈ ఐపీఎల్ లో కామెంట్రీ చెప్పడం చాలా ఉత్సాహంగా ఉందంటూ, తాను కామెంట్రీ చేసే విధానం చాలా సరదాగా ఉంటుందని, స్టార్ స్పోర్ట్స్ టీమ్ లో భాగమవ్వడం చాలా గౌరవంగా ఉందని తెలిపాడు.తాను గేమ్ ను రీడ్ చేసే విధానం ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నట్లు తెలిపాడు.
తరువాత విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.విరాట్ కోహ్లీ చాలా మంచి ఆటగాడు.
కానీ కొన్ని సంవత్సరాలుగా అసాధారణ ప్రదర్శన కనబరుస్తు ప్రేక్షకుల్లో నిరాశ ను నింపుతున్నాడు.పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా చాలా సులభంగా ఛేదించే కోహ్లీ ఆట తీరు తనకు బాగా నచ్చుతుందని తెలుపుతూ, ఇక మహేంద్రసింగ్ ధోని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.
ధోని ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భావోద్వేగాలను ప్రదర్శించడు.తన నుంచి ఇదే నేర్చుకున్నానని స్టీవ్ స్మిత్ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.







