బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుని ఇప్పటికీ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న హీరోయిన్లలో ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) ఒకరు.తెలుగులో కూడా ప్రియాంక చోప్రాకు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.30 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో తన తల్లి, డాక్టర్ సూచనల మేరకు తాను అండాలను దాచిపెట్టానని ఆమె చెప్పుకొచ్చారు.
తనకు పిల్లలు అంటే చాలా ఇష్టమని పెద్దవాళ్ల కంటే పిల్లలకే ఎక్కువ టైమ్ కేటాయిస్తానని ప్రియాంక చెప్పుకొచ్చారు.అండాలను దాచిపెట్టుకోవడం స్వేచ్ఛా భావనను కలిగించిందని ఆమె కామెంట్లు చేశారు.
అప్పట్లో తాను ఎవరితో పిల్లలను కనాలని భావించానో ఆ వ్యక్తిని కలవలేకపోయానని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు.నాకు ఎప్పుడూ పిల్లల్ని కనాలని ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో నిక్ జోనస్( Nick Jonas ) వయస్సు 25 సంవత్సరాలు అని అప్పుడు నిక్ కు పిల్లల్ని కనడం ఇష్టం ఉందో లేదోనని అనుమానం ఆమె కామెంట్లు చేశారు.నిక్ జోనస్ తో అప్పట్లో డేటింగ్ కు ఒప్పుకోవడం వెనుక కారణం ఇదేనని ప్రియాంక చోప్రా వెల్లడించారు.2022 జనవరి నెలలో ప్రియాంక, నిక్ దంపతులు ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.2018 సంవత్సరంలో ప్రియాంక, నిక్ లకు వివాహం జరిగింది.
ప్రియాంక, నిక్ కలకాలం సంతోషంగా జీవనం సాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ప్రియాంకకు విదేశాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.కెరీర్ పరంగా ప్రియాంక మరింత సక్సెస్ కావాలని అభిమానులు భావిస్తున్నారు.సినిమా సినిమాకు ప్రియాంకకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ప్రియాంక చోప్రా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సినిమా సినిమాకు ప్రియాంక చోప్రాకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.