న్యాచురల్ స్టార్ నాని( Nani ) ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో తన సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూనే ఈ రోజు నాని సోషల్ మీడియా వేదికగా చేసిన బ్యూటిఫుల్ పోస్ట్ నెట్టింట అందరిని ఆకట్టు కుంటుంది.
ఈ రోజు నాని కొడుకు పుట్టిన రోజు కావడంతో తన తనయుడికి విషెష్ చెబుతూ పోస్ట్ చేసాడు.
ఈ రోజుతో తన కొడుకు అర్జున్( Arjun ) ఆరవ ఏట అడుగు పెట్టబోతుండగా తాను తన కొడుకుతో కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ విషెష్ చెప్పాడు.
ఈ పిక్ లో అర్జున్ విల్లు పట్టుకుని ఉండగా నాని తన కొడుకుతో లక్ష్యాన్ని ఎలా సాదించాలి అని తన కొడుకుకి చెబుతున్నట్టుగా కనిపిస్తుంది.అందుకే ఈ పిక్ నెట్టింట అందరిని ఆకర్షిస్తుంది.
ఇదిలా ఉండగా నాని సినిమా విషయానికి వస్తే.
నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ‘దసరా‘( Dasara ).రా అండ్ విలేజ్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన సినిమాను సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ చేయగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపు మార్చి 30న గ్రాండ్ గా ఐదు భాషల్లో రిలీజ్ అవ్వబోతుంది.
ఈ క్రమంలోనే అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధం అయ్యింది.ఈ సినిమాపై నాని స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు.ఇక ఆది పినిశెట్టి కీలక రోల్ చేస్తుండగా ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
మరి ఈ సినిమా నాని కెరీర్ ను ఏ స్టేజ్ కు తీసుకు వెళుతుందో చూడాలి.