తాజాగా అమెరికన్ సిట్ కామ్ ఇది బిగ్ బ్యాంగ్ థియరీ షోపై బాలీవుడ్ నటి జయా బచ్చన్( Jaya Bachchan ) మండిపడింది.షోలోని ఎపిసోడ్ లో బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ పై( Madhuri Dixit ) చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడింది.
ది బిగ్ బ్యాంగ్ థియరీ షోలో పాల్గొన్న కునాల్ నయ్యర్( Kunal Nayyar ) ఐశ్వర్య రాయ్ తో పోలుస్తూ మాధురి దీక్షిత్ ను వేశ్య అని సంబోధించారు.ఇదే విషయం గురించి బాలీవుడ్ లో తీవ్ర స్థాయిలో చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే.
కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విషయం పై స్పందిస్తూ మండి పడుతున్నారు.అంతేకాకుండా కునాల్ నయ్యర్ వ్యాఖ్యల పట్ల జయా బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాడికి ఏమైనా పిచ్చి పట్టిందా? అతన్ని వెంటనే మానసిక ఆసుపత్రికి తరలించాలి అనే ఆమె తెలిపింది.అలాగే అతని వ్యాఖ్యల పట్ల అతని కుటుంబ సభ్యులను నిలదీయాలి అనే ఆమె మండిపడింది.
కాగా ఆ షోలో షెల్డన్ కూపర్ పాత్రను పోషిస్తున్న జిమ్ పర్సన్ ఐశ్వర్యారాయ్ ని పొగిడారు.

ఆ సమయంలోనే మాధురి దీక్షిత్ ను పోలుస్తూ కునాల్ నయ్యర్ అసభ్య పదజాలయాన్ని ఉపయోగించారు.కాగా కునాల్ నయ్యర్ వ్యాఖ్యల పట్ల నటి ఊర్మిళ మటోండ్కర్ ఇది అత్యంత దారుణం అని ఆమె పేర్కొంది.అలాగే అది వారి చీఫ్ మెంటాలిటీని చూపిస్తోంది అంటూ ఆమె మండి పడింది.కాగా ఇప్పటికే ఆ ఎపిసోడ్ ని తొలగించాలి అంటూ రచయిత, రాజకీయ విశ్లేషకుడు అయినా

మిథున్ విజయ్ కుమార్ స్ట్రీమింగ్ దిగ్గజాన్ని కోరుతూ నెట్ ఫ్లిక్స్ కి లీగల్ నోటీసులు కూడా పంపిన విషయం తెలిసిందే.అతని వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయి.పరువు నష్టం కలిగించేలా ఉన్నాయి అంటూ లీగల్ నోటీసులో విజయ్ కుమార్ పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఆ షోపై అతనిపై మండిపడుతున్నారు.







