మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు కేసులో ఏ5గా ఉన్న నిందితుడు శివ శంకర్ రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ ను న్యాయస్థానం విచారించింది.
అదేవిధంగా కేసు దర్యాప్తు ఆలస్యంపై ధర్మాసనం విచారించింది.గతంలో విచారణ అధికారిని మార్చాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో అధికారి మార్పుపై సీబీఐ ప్రతిపాదనలు అందించింది.రామ్ సింగ్ ను కొనసాగించాలన్న ప్రతిపాదనతో పాటు తులసమ్మ పిటిషన్ నివేదికను సైతం అందజేసింది సీబీఐ.
అయితే రామ్ సింగ్ ను కొనసాగించడంపై న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తోంది.కేసులో పురోగతి లేనప్పుడు రామ్ సింగ్ ను కొనసాగించడంలో అర్థం లేదని పేర్కొన్నారు.
మరోవైపు నిందితుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని భార్య తులసమ్మ న్యాయస్థానాన్ని కోరింది.ఈ విషయాన్ని పరిశీలిస్తామన్న ధర్మాసనం.
దర్యాప్తు అధికారిని మార్చాలన్న పిటిషన్ పై ఉత్తర్వులు వెలువరించనుంది.







