టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి ఎన్టీఆర్ కీ ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆర్ఆర్ఆర్ ( RRR ) సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని తెచ్చుకున్నారు ఎన్టీఆర్.
ప్రస్తుతం ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు.ఇకపోతే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి( Lakshmi Pranathi ) గురించి కూడా మనందరికీ తెలిసిందే.
ఎన్టీఆర్ భార్యగా ప్రణతి మనందరికీ సుపరిచితమే.
తారక్ ఒకవైపు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గా గడుపుతుంటే లక్ష్మి తనకి కొడుకులు, ఫ్యామిలీ ని చూసుకుంటూ ఉంటుంది.
కాగా ఎన్టీఆర్ కీ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి అంటే ఎంతో ఇష్టం అన్న సంగతి మన అందరికి తెలిసిందే.ఇప్పటికే ఎన్టీఆర్ పలు సందర్భాలలో తనకు తన భార్య అంటే తనకు ఎంత ఇష్టం అన్న సంగతిని పలు సందర్భాలలో చెప్పుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఇక ఎన్టీఆర్ సినిమాలలో నటిస్తున్న సమయం దొరికినప్పుడల్లా భార్య పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఇంకా ప్రణతి అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం భార్య ప్రణతితో కలిసి జపాన్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే.ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి.
తాజాగా లక్ష్మి ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఆమె తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలలో లక్ష్మీ ప్రణతి ధరించిన డ్రెస్ హ్యాండ్ బ్యాగ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.ఈ క్రమంలోనే కొందరు నెటిజెన్స్ లక్ష్మీ ప్రణతి ధరించిన ఆ హ్యాండ్ బ్యాగ్, డ్రెస్ గురించి వాటి ఖరీదు గురించి సెర్చ్ చేయగా ఆ విషయాలు కాస్త బయటకు వచ్చాయి.ప్రణతి హ్యాండ్ బ్యాగ్.లూయిస్ విట్టన్ పెటిట్ మల్లె ఆ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు దాదాపుగా రూ.3,28,154 గా ఉంది.అలాగే ఆమె ధరించిన డ్రెస్, అనుశ్రీ రెడ్డి ఫ్లోరియన్ బ్రౌన్ ఫ్రంట్ నాటెడ్ కాఫ్తాన్ దాని ధర రూ.43,900 గా ఉంది.







