పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రెజెంట్ ఫుల్ బిజీగా ఉన్నాడు.ఒకవైపు రాజకీయాలు.
మరో వైపు సినిమాలు.ఇలా పవర్ స్టార్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు.
పవన్ ఎప్పుడో ప్రకటించిన సినిమాలను పూర్తి చేయకుండానే మరిన్ని సినిమాలను ప్రకటిస్తున్నాడు.సినిమాలు అయితే ప్రకటిస్తున్నాడు కానీ వాటిని పూర్తి చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు.
అందుకే ఫ్యాన్స్ మాత్రం ఒక్క సినిమా అయిన పూర్తి చేయమని ఆయనను కోరుతున్నారు.ఈ క్రమంలోనే పవన్ కొద్దిగా రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి కొత్త సినిమాలను పూర్తీ చేసే పనిలో పడ్డారు.
ముందుగా పవన్ రీమేక్ మూవీ వినోదయ సీతం సినిమాను పూర్తి చేసాడు.కేవలం 22 రోజుల డేట్స్ లోనే తన పార్ట్ షూట్ పూర్తి చేసాడు.ఇక ఈ సినిమా తర్వాత ఏప్రిల్ లో హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి అవ్వగానే మధ్యలోనే ఆగిపోయిన హరిహర వీరమల్లు షూట్ లో అడుగు పెట్టబోతున్నాడు అని సమాచారం.ఇలా పవన్ ప్రకటించిన అన్ని సినిమాలను కవర్ చేస్తూ వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు.ఇక పవన్ లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ”ఓజి” (OG Movie) కూడా ఉంది.
సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది.
ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యిన ఈ సినిమా నుండి ఇప్పుడు సాలిడ్ అప్డేట్ అందుతుంది.తాజా సమాచారం ప్రకారం సుజీత్ ఈ సినిమాను తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట.అందుకే నిర్మాత డివివి దానయ్య కూడా ఈ సినిమా టైటిల్ ను పాన్ ఇండియా (Pan India) భాషల్లో రిజిస్టర్ కూడా చేయించారని టాక్.
దీంతో హరిహర వీరమల్లుతో పాటు రెండు సినిమాలు పాన్ ఇండియా లెవల్లో రానున్నాయి.