నల్లగొండ జిల్లా:క్రీడలు యువతకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ రాఘవేందర్ అన్నారు.మిర్యాలగూడ పట్టణంలోని క్లియో స్పోర్ట్స్ అరేనా స్టేడియంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో భాగంగా మంగళవారం కే.
ఎస్.ఆర్.యు వర్సెస్ రాణా ప్రతాప్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను బ్యాడ్మింట్ జిల్లా కోచ్ మారబోయిన రామకృష్ణ, టీసీఏ జిల్లా కోచ్ కావాలి వెంకన్న,సీనియర్ క్రికెట్ ప్లేయర్ కోదాటి సత్యంతో కలిసి టాస్ వేసి ప్రారంభించించారు.ఈ సందర్భంగా సీఐ క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిజికల్ ఫిట్నెస్,క్రమశిక్షణకు క్రీడా సాధన చేయాలన్నారు.తదుపరి జగడం క్రాకర్స్ స్పాన్సర్ చేసిన టీషర్ట్స్ ను క్రీడాకారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జగడం అశోక్,కాటేపల్లి ఉదయ్ కుమార్,ప్రేమ్,కోదాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.







