ఎనిమిదేళ్ల తర్వాత రాబోతున్న దర్శకుడిపై కూడా ఇంత నమ్మకం ఉండటానికి కారణం అదే!

సమంత హీరోయిన్‌ గా నటించిన శాకుంతలం ( Shaakuntalam )సినిమా విడుదలకు సిద్ధం అయింది.వచ్చే నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై ఉన్న అంచనాలతో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది.

 Gunashekhar Shakuntalam Movie Public Response , Gunashekhar , Shakuntalam , Sama-TeluguStop.com

పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క ప్రమోషన్ హడావుడి ఆకాశాన్ని తాకింది.ఆకట్టుకునే అందంతో పాటు ఈ సినిమాలో సమంత యొక్క నటన ప్రతిభను చూడబోతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.

ఇక ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు.ఈయన సినిమా వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయింది.

అనుష్క తో గతంలో రుద్రమదేవి( Rudrama Devi ) సినిమాను రూపొందించాడు.ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటి వరకు సినిమాను తీసుకు రాలేక పోయాడు.

రుద్రమదేవి సినిమా యొక్క టాక్ పాజిటివ్‌ గా వచ్చింది.కలెక్షన్స్‌ కూడా భారీగా వచ్చాయి.

అయినా కూడా గుణశేఖర్ సినిమా ను జనాలు చూడాలని ఆశ పడుతున్నారు.అందుకు కారణం ఆయన నుండి గతంలో వచ్చిన సినిమాలు అనడంలో సందేహం లేదు.

హీరోయిన్‌ గా సమంత నటించడం తో పాటు గుణశేఖర్‌( Gunashekhar ) దర్శకత్వం పై ఉన్న నమ్మకం కారణంగా శాకుంతలం సినిమా కు తెలుగు రాష్ట్రాల్లో భారీ గా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగి ఉంటుంది అనడంలో సందేహం లేదు.పైగా ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.కాస్త ఎక్కువగానే ఖర్చు చేసి ఈ సినిమాను రూపొందించారు.గ్రాఫిక్స్‌ భారీగానే ఉపయోగించినట్లుగా తెలుస్తోంది.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే తప్పకుండా ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు నమోదు చేయడం ఖాయం అంటున్నారు.గుణ శేఖర్‌ ఈ సినిమా తో సక్సెస్ అయితే కచ్చితంగా ముందు ముందు ఆయన స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.పాన్ ఇండియా రేంజ్ లో సినిమా ప్రమోషన్ జరుగుతోంది.కనుక అక్కడ కూడా భారీ వసూళ్లు సాధిస్తుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube