టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు అంటేనే నయవంచన, నమ్మకద్రోహం, వెన్నుపోటని తెలిపారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే సీఎం జగన్ కు తెలుసన్నారు.
ఓట్లు కోట్లు కేసులో దొరికిన చరిత్ర చంద్రబాబుది అంటూ విమర్శలు గుప్పించారు.చంద్రబాబు చరిత్ర అంతా కొనుగోలు రాజకీయమని వెల్లడించారు.
కానీ ఇప్పుడు చంద్రబాబు నంగనాచి కబుర్లు చెప్తున్నారంటూ మండిపడ్డారు.కొనడం – అమ్మడం చంద్రబాబు విజయ రహస్యం అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.







