బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి సీరియల్స్ లో స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు( Guppedantha Manasu ) సీరియల్ ఒకటి.ఈ సీరియల్ లో రిషి( Rishi ) వసుధార( Vadudhara )ల ప్రేమ కథ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇకపోతే ఈ సీరియల్ లో వసుధార పాత్రలో నటిస్తున్నటువంటి నటి పేరు రక్ష గౌడ్( Raksha Gowd) .ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయనే విషయం మనకు తెలిసిందే.ఇలా వసుధారగా తెలుగు సీరియల్స్ లో నటిస్తూ ఎంతోమందికి అభిమాన నటిగా మారిపోయినటువంటి ఈ రక్షా గౌడ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

రక్ష గౌడ్ బెంగళూరులో జన్మించారు.ఈమెకు చిన్నప్పటి నుంచి నటనపై ఎంతో ఆసక్తి ఉండటంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి తన కెరియర్ ప్రారంభించారు.ఇలా ఒకవైపు మోడలింగ్ రంగంలో దూసుకుపోతూనే మరోవైపు ఉన్నత చదువులు కూడా చదువుతూ వచ్చారు.
ఇలా ఈమె బి బి ఏ చదువుతూ ఉండగా రాధా రమణ అనే కన్నడ సీరియల్ లో నటించే అవకాశాన్ని అందుకుంది.ఫుట్ మాలీ అనే కన్నడ సీరియల్ లో కూడా నటించి కన్నడ ఆడియన్స్ కి దగ్గరైంది.
ఇలా నటించిన రెండు సీరియల్స్ ద్వారా ఎంతో మంది కన్నడ ఆడియన్స్ కి దగ్గరైంది.

ఇక తెలుగులో ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్ సోహైల్ తో కలిసి కృష్ణవేణి అనే సీరియల్ లో నటించి తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఇలా తెలుగు బుల్లితెరకు పరిచయమైనటువంటి రక్ష గౌడ్ అనంతరం నటుడు ముఖేష్ గౌడ్ తో కలిసి ఈమె గుప్పెడంత మనసు సీరియల్ లో నటించారు.ఇక ఈ సీరియల్ లో వీరిద్దరి పర్ఫామెన్స్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఇక స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి సీరియల్స్ లో అత్యధిక రేటింగ్ సొంతం చేసుకున్నటువంటి సీరియల్ గా గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.







