సపోటా పండ్ల సాగులో ఎరువుల వాడకం.. సంరక్షణ పద్ధతులు..!

సపోటా( Sapodilla ) భారతదేశంలోని కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతోంది.ఈ చెట్లనుండి కారే పాలను చూయింగ్ గమ్ తయారీలో ఉపయోగిస్తారు.

 Fertilizer Use In Sapodilla Fruit Cultivation.. Preservation Methods , Sapodilla-TeluguStop.com

నేల యొక్క పీహెచ్ విలువ 6 నుండి 8 మధ్య ఉండే ఎటువంటి నేలలోనైనా సపోటా పంట సాగు చేయడానికి అనుకూలమే.ఇక సపోటా పంట వేసే నెలలో కాల్షియం తక్కువగా ఉండేటట్లు చూసుకోవడంతో పాటు బంక మట్టి నేలలు అనుకూలంగా ఉండవు.

సపోటా పండ్ల సాగుకు 43 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే పూత రాలే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉష్ణోగ్రత 43 డిగ్రీల కంటే తక్కువగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.

నేలలో ఎటువంటి పంటలు పండించాలన్న ముందుగా వేసవికాలంలో లోతు దుక్కులు రెండు లేదా మూడుసార్లు చేసుకుంటే కలుపు సమస్యలతో పాటు వివిధ రకాల చీడపీడల బెడద ఉండదు.

అంటే సూర్య రశ్మి కిరణాలు నేల లోపలికి చచ్చుకుపోవడంతో నేలలోని వివిధ రకాల పురుగులు అవి పెట్టే గుడ్లు నాశనం అవుతాయి.సపోటా పంట వేయడానికి ముందు నేలలో 25 కేజీల పశువుల ఎరువుతో పాటు అజోస్పైరిల్లం 20 గ్రాములు, ట్రైకోడెర్మా విరిడే( Trichoderma viride ) 30గ్రా, మైకోరైజ 50 గ్రాములు కలిపి ప్రతి మొక్క నాటే స్థలంలో మట్టిలో కలపాలి.

నాలుగు సంవత్సరాల తర్వాత ఈ ఎరువులను రెట్టింపు స్థాయిలో ప్రతి మొక్క చుట్టు పాదులు తీసి మట్టిలో కలపాలి.ఇలా ఏడు సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరాలకు ఒకసారి పంటకు ఎరువులను అందించి మొక్కలు ఎదుగుతున్న క్రమంలో ఒక కిలో పొటాషియం నైట్రేట్ ను 200 లీటర్ల లో కలిపి పిచికారి చేయాలి.

Telugu Agriculture, Copper Sulphate, Fertilizer, Formers, Latest Telugu, Sapodil

డ్రిప్ ద్వారా నీటిని అందించాలి.మొదటి పంట సేకరించాక ఎండిపోయిన కొమ్మలను, తెగులు సోకిన కొమ్మలను, విరిగిన కొమ్మలను తొలగించాలి.తెగుల నివారణకు ఒక కిలో కాపర్ సల్ఫేట్( copper sulphate ) ఒక కిలో సున్నం కలిపి తెగులు ఉండే కొమ్మల చివరల పూయాలి.ఇక రసం పీల్చే పురుగులు సిలింద్రాల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 17.8% 80ml+ కార్బెం డిజం 50% 200 గ్రా .ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube