రామ్ చరణ్( Ram Charan ) పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.చాలా మంది ఫ్యాన్స్ రక్తదానాలు చేస్తుండగా.
కొందరు ఫ్యాన్స్ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.మొత్తానికి రామ్ చరణ్ పుట్టిన రోజున అభిమానులు పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నారు.
ఇక ఇండస్ట్రీలో హడావుడి విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్( Shankar ) దర్శకత్వంలో దిల్ రాజు( Dil Raju ) నిర్మాణంలో ఒక సినిమాను రామ్ చరణ్ చేస్తున్నాడు.

ఆ సినిమాకు సంబంధించిన యూనిట్ సభ్యులు సెట్స్ లో భారీగా పుట్టిన రోజు వేడుక నిర్వహించారు.చరణ్ తో కేక్ కట్ చేయించారు.ఆ సమయంలో పూల వర్షం కురిపించి ఆశ్చర్యపర్చారు.
రామ్ చరణ్ తో పాటు ఆయన పక్కన ఉన్న వారిని కూడా పూలతో ముంచేశారు.రామ్ చరణ్ మరియు శంకర్ కాంబో మూవీ నుండి ఏదైనా సర్ ప్రైజ్ వస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

హీరోగా రామ్ చరణ్ మరో వైపు బుచ్చి బాబు(Buchi Babu ) దర్శకత్వంలో కూడా నటించేందుకు ఓకే చెప్పడం జరిగింది.కనుక ఆ సినిమా అప్‌డేట్ ను నిర్మాణ సంస్థ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.అభిమానులు ఆరంజ్ సినిమా ప్రత్యేక షో లను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.జనసేన పార్టీ కి విరాళం అంటూ ప్రకటించడంతో చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున ఆరెంజ్ షో లను సక్సెస్ చేశారు.
అంతే కాకుండా ఒక భారీ ఈవెంట్ ను నిర్వహించారు.ఆ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు తో పాటు ఇంకా పలువురు మెగా ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఇతర యూనిట్ సభ్యులు హాజరు అయ్యారు.
భారీ అంచనాల నడుమ చరణ్ బర్త్ డే వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.మా తరపున మరియు మీ యొక్క అభిమానుల తరపున కూడా మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.







