Tollywood Writers: ఐటెం సాంగ్ కోసం కోట్లు కానీ కథకులకు ఇంత అన్యాయమా..?

ఒక సినిమా తీయాలంటే ఎన్నో కోట్లు ఖర్చు పెడతారు ఐటెం సాంగ్( Item Songs ) లాంటి వాటి కోసం కూడా మిలియన్స్ ఖర్చు పెట్టే రోజులు ఇవి.

అయితే ఇన్ని కోట్లు ఖర్చుపెట్టే నిర్మాతలు ఆ సినిమా కథ అందించే రచయితకు ( Writers ) మాత్రం రెండు లేదా మూడు లక్షలు ఇవ్వడానికి కూడా వెనకాడుతూ ఉంటారు.

సినిమాకు కథ రాసే వారి కష్టాల గురించి ఎన్ని సినిమాలు తీసిన తక్కువే వారి కష్టాలను వారి కథల రూపంలో చూపించుకునే అవకాశం లేదు కాబట్టి ఇప్పటికీ ఆ విషయాలు సామాన్య ప్రజలకు తెలియడం లేదు.సినిమా మీరు చూసే ఉంటారు ఆ సినిమాలో ఘోస్ట్ రైటర్ అనే ఒక విషయాన్ని చూపించారు కదా.ఇండస్ట్రీ లో కూడా అచ్చు అలాగే జరుగుతుంది.ఎవరో పేరు ఉన్న రచయితలకు తప్ప మిగతా వారికి పేరు రాదు.

వారు కథ అందిస్తారు కానీ ఎక్కడ పేరు వేయించుకోవడానికి అర్హత సంపాదించలేరు.

లక్షో రెండు లక్షల ఇస్తామని చెప్పి యువ రచయితలను మోసం చేస్తూ వారి కథలను లాక్కుంటున్నారు బడా నిర్మాణ సంస్థలు.క్రియేటివిటీ పేరుతో ఆ రచయితల తలలు వంచి కథలు రాయించుతున్నారు.అయితే ఇండస్ట్రీ అంతా ఇలా ఉంటుందని కాదు.

Advertisement

రామానాయుడు ( Producer Ramanaidu ) లాంటి నిర్మాత రచయితని ఎంతో గౌరవించేవాడు అతడికి రావాల్సిన మొత్తం ఒకేసారి ఇచ్చేవాడు.మరి నేడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.

అవసరాల శ్రీనివాస్( Avasarala Srinivas ) లాంటి ఒక రైటర్ మరియు దర్శకుడు తన మొదటి సినిమాను ఒప్పించుకోవడానికి తన యావత్ ఆస్తిని మొత్తం ఫణంగా పెట్టాడట అలా పెడితేనే తనకి మొదటి సినిమా అవకాశం వచ్చిందట.

ఇక మరొక దర్శకుడు మరియు రచయిత హర్షవర్ధన్( Harshavardhan ) పరిస్థితి కూడా అచ్చు ఇలాంటిదే.తాను ఊరికే దర్శకుడు అయిపోలేదు దాని కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందట.ఒకప్పుడు సినిమా అనేది ఒక కళాత్మకత తో కూడిన వ్యాపారం కానీ నేడు అది పూర్తిస్థాయిగా వ్యాపారంగా మిగిలిపోయింది.

ఇక రెబ్బిన దేశం విషయానికి వచ్చేసరికి ఎప్పుడు హీరో తర్వాత హీరోయిన్ ఆ తర్వాత దర్శకుడు లేదా సంగీత దర్శకుడు మాత్రమే.కానీ ఈ సినిమా తీయడానికి కారణమైన ఆ రచయిత ఎప్పుడు చివరనే మిగిలిపోతున్నాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

సినిమా ఇండస్ట్రీలో దోపిడీ మొదలయ్యేది కూడా కథ నుంచి చాలామంది నిర్మాతలు కథలు ఇచ్చిన రచయితలకు తెలియకుండానే సినిమాలు తీస్తారు.

Advertisement

తాజా వార్తలు