విజయవాడలో దుర్గగుడి దుకాణ యజమానులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారంటూ నిరసనకు దిగారు.
మెరుగైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు.దుకాణాల అద్దెలు తగ్గించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
తమ వ్యాపారాలు సజావుగా జరిగే ప్రదేశంలో తమ షాపులను కేటాయించాలని దేవస్థానం అధికారులకు విన్నవించారు.అదేవిధంగా తమ షాపుల సైజులను కూడా పెంచాలని కోరారు.