దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సీనియర్ హీరోయిన్ మీనా(Meena) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీనా అనంతరం హీరోయిన్ గా తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలందరి సరసన నటించి హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.
ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే ఈమె వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న సమయంలోనే ఈమె తన భర్తను కోల్పోయారు.
ఇలా భర్త మరణంతో ఎంతో కృంగిపోతున్న మీనా రెండో పెళ్లి(Second Marriage) చేసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి.
అయితే ఈ వార్తలను మీనా ఇదివరకే ఖండించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే తాజాగా ప్రముఖ ఫిలిం క్రిటిక్, నటుడు తమిళ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మీనా పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆ హీరో మాట్లాడుతూ మీనా త్వరలోనే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇక ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరో( Kollywood Hero ) అని ఆయన గత ఏడాదే తన భార్యకు విడాకులు కూడా ఇచ్చారు అంటూ హింట్ ఇచ్చారు.
ఇక ఈ హీరో వయసులో మీనా కన్నా చిన్నవాడు అయినప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని ఇప్పటికే నిశ్చితార్థానికి ముహూర్తం కూడా నిర్ణయించారు అంటూ ఈయన చెప్పడంతో ఈ వార్తలు కాస్త కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.ఇక ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ స్పందిస్తూ ఏదైనా చెబితే నమ్మేలాగా ఉండాలి…ఇలాంటి తప్పుడు వార్తలను ఎలా పుట్టిస్తారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.అయితే గతంలో మీనా తన రెండో పెళ్లి గురించి స్పందిస్తూ తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని ఇలా తన గురించి తప్పుడు వార్తలు సృష్టించి తనని బాధ పెట్టొద్దు అంటూ ఈమె రెండో పెళ్లి వార్తలను ఖండించిన విషయం తెలిసిందే.