2023 – 24 సంవత్సర విద్యుత్ టారిఫ్ ను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ పీవీ నాగార్జున రెడ్డి విడుదల చేశారు.
సబ్సిడీలతో మూడు డిస్కంలకు రూ.10,135 కోట్ల లోటును భరించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని నాగార్జున రెడ్డి తెలిపారు.సాధారణ, పారిశ్రామిక వినియోగదారుల కేటగిరీలో అదనపు ఛార్జీలు లేవన్నారు.
హెచ్.టీ వినియోగదారులకు మాత్రం కిలో వాట్ కు రూ.475 అదనపు డిమాండ్ ఛార్జ్ ప్రతిపాదనను అంగీకరించామని వెల్లడించారు.మిగతా ప్రతిపాదనలు అన్నీ తిరస్కరించామని జస్టిస్ నాగార్జున రెడ్డి పేర్కొన్నారు.







