”రౌద్రం రణం రుధిరం” ( RRR ) సినిమాతో పాన్ ఇండియా మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్ ( NTR ) .కొమురం భీమ్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి గ్లోబల్ స్టార్ గా గొప్ప పేరు సంపాదించు కున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కూడా భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు.ఆర్ ఆర్ ఆర్ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు.
ఈ సినిమా రెండు రోజుల క్రితమే అఫిషియల్ గా పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయ్యింది.NTR30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తుండగా.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమా 2024, ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుండగా ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా రెగ్యురల్ షూట్ అతి త్వరలోనే స్టార్ట్ కానుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 31వ సినిమాను కూడా ఎవరితో చేయబోతున్నారో ప్రకటించారు.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రకటించాడు.ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.
ఇదిలా ఉండగా బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ఎన్టీఆర్ తో ఒక సినిమాను నిర్మించేందుకు సిధ్దం అయ్యారని తాజాగా వినిపిస్తున్న టాక్.

ఆయన ఎవరో కాదు.టి సిరీస్ సంస్థ అధినేత భూషణ్ కుమార్.ఈయన త్వరలోనే ఎన్టీఆర్ తో భారీ పాన్ ఇండియన్ మూవీ నిర్మించనున్నట్టు టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తుంది.ఎన్టీఆర్30 సినిమా ప్రారంభోత్సవానికి టి సిరీస్ అధినేత స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.ముంబై నుండి స్పెషల్ గా విచేయడంతో ఈయన ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ సంస్థ ప్రభాస్, అల్లు అర్జున్ తో భారీ సినిమాలను సెట్ చేసుకోగా ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా లైనప్ చేసుకోవడం ఫ్యాన్స్ లో మంచి క్రేజీ న్యూస్ అయ్యింది.








