తక్కువకే ఫాస్ట్రాక్ స్మార్ట్ వాచ్ కోనేయండి.. అదిరిపోయే ఫీచర్లు మీకోసం!

ఇపుడు అంతటా స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తుందని చెప్పుకోవాలి.ఇపుడు ఈ వాచ్‌లు కేవలం సమయం చూసుకోడానికి మాత్రమే కాకుండా ముఖ్యంగా ఫిట్‌గా ఉండేందుకు వాడడం మొదలు పెట్టారు.

 Buy Fastrack Watch Smart Watch For Less.. Amazing Features For You! Fastrack Wa-TeluguStop.com

అవును, ఈ స్మార్ట్ వాచెస్( Smartwatch ) అనేవి ఇపుడు మనిషి జీవనశైలిని మెరుగుపర్చడంలో ప్రముఖ పాత్రను వహిస్తున్నాయి.వర్క్ అవుట్ సమయంలో హృదయ స్పందన రేటు, ఎస్‌పీఓ2 రేట్, క్యాలరీల సమయం వంటి ఎన్నో వివరాలను ఇవి తెలియజేస్తున్నాయి.

అందుకే ఇపుడు కేవలం యువత మాత్రమే కాకుండా అన్ని వయస్సులవారు వీటిని ధరించడానికి మొగ్గు చూపుతున్నారు.

ఈ క్రమంలోనే మధ్యతరగతి జనాల్లో ఎక్కువగా క్రేజ్ వున్న ప్రముఖ వాచెస్ కంపెనీ జనాలను ఆకట్టుకునేందుకు మరో కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ చేసే పనిలో పడింది.అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా ఈ వాచ్‌ను రూపొందించినట్టు కంపెనీ తాజాగా ఓ ప్రకటనలో చెప్పుకొచ్చింది. ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్‌ఎస్ 1( Fastrack revoltt fs1 ) పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్ కచ్చితం వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు మంచి ధీమాగా వున్నాయి.కాగా ఈ వాచ్ ధర కేవలం రూ.1695 మాత్రమే.

ఈ వాచ్ ఫ్లిప్ కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.ఈ స్మార్ట్ వాచ్‌ ఇతర ఫీచర్లు విషయానికొస్తే, ఈ వాచ్ 1.83 అంగుళాల కర్వ్‌డ్ డిస్ ప్లే కలిగి ఉండి, అత్యాధునికమైన వేగవంతమైన పనితీరుని కలిగి ఉంటుంది.110 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ కలిగి ఉండి, వినియోగదారుని నిరంతర ఆరోగ్య పర్యవేక్షణని కలిగి ఉంటుంది.ఒత్తిడి పర్యవేక్షణ, ఆటో స్లీప్ ట్రాకింగ్, హార్ట్ బీట్ ట్రాకింగ్, ఏఐ వాయిస్ అసిస్టెంట్‌తో పాటు జెన్ జెడ్ రెడీ ఫీచర్లు అందులటులో కలవు.బ్లాక్, బ్లూ, గ్రీన్, ఆఫ్‌బీట్ టీల్ వంటి రంగుల్లో ఇవి లభ్యం కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube