ఈ మధ్య సెలబ్రిటీలు బాగా సన్నబడుతూ అందరికీ షాక్ లు ఇస్తున్నారు.భవిష్యత్తు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటున్నారు.
ముఖ్యంగా ఇండస్ట్రీలో మరికొంతకాలం కొనసాగడం కోసం లేని అందాలను కూడా తెచ్చుకుంటున్నారు.లావుగా ఉన్న సెలెబ్రిటీలు మాత్రం ఏకంగా సన్నగా మారి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు సన్నబడ్డారు.బాగా వర్కౌట్లు చేసి మంచి ఫిజిక్ సొంతం చేసుకున్నారు.
అయితే తాజాగా హరితేజ కూడా సన్నబడి అందరికి షాక్ ఇచ్చింది.

బుల్లితెర, వెండితెర ఆర్టిస్ట్ హరితేజ( Hari Teja )ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నటనపరంగా మాత్రం మంచి మార్కులను సంపాదించుకుంది.తొలిసారిగా ఆడవారి మాటలకు అర్ధాలే వేరు సినిమాతో వెండితెరకు పరిచయం కాగా.
ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకుంది.ఇక బుల్లితెరకు మనసు మమత సీరియల్ తో ఎంట్రీ ఇవ్వగా.
ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.అంతేకాకుండా బుల్లితెర లో పలు షోలలో కూడా యాంకరింగ్ చేసింది.
ఆ తర్వాత 2017 లో ప్రసారమైన బిగ్ బాస్( Bigg Boss ) రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.చివరికి వరకు హౌస్ లో ఉంటూ మూడవ స్థానంలో నిలిచింది.

బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది హరితేజ.ఇక మంచి ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన సమయంలో పెళ్లి చేసుకోగా.ఒక పాపకు జన్మనిచ్చింది.ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది హరితేజ.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాగా రచ్చ రచ్చ చేస్తుంది.తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.
అప్పుడప్పుడు తను జిమ్ లో చేసిన వర్కౌట్ వీడియోలను కూడా పంచుకుంటుంది.

ఈమధ్య బాగా గ్లామర్ షో కూడా చేస్తుంది.ఈ వయసులో కూడా ఆమె అటువంటి గ్లామర్ షో చేయటంతో చాలామంది ఈమెను ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా రచ్చ రచ్చ చేస్తుంది.
ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది.ఇకపై ఇండస్ట్రీలో కొనసాగడం కోసం మరింత కష్టపడుతుంది.
అయితే ఈమె చూడ్డానికి కాస్త లావుగా ఉండేది.కానీ ఇప్పుడు మాత్రం చాలా సన్నబడింది.
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా ఆ ఫోటోలలో ఆమె చాలా సన్నబడినట్లు కనిపించింది.ఇంత సడన్ గా ఆమె సన్నబడటంతో అందరూ షాక్ అవుతున్నారు.
మొన్నటి వరకు లావుగా ఉన్న హరితేజ.ఇంత త్వరగా సన్నబడటం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలను గమనించినట్లయితే అందులో తను చీర కట్టుకొని ఫోటోలకు బాగా ఫోజులిచ్చింది.అందులో తన బాడీ మొత్తం సన్నబడగా చాలా అందంగా కనిపించింది.
సడన్ గా చూస్తే ఆమెను హీరోయిన్ అని అనుకోవచ్చు.ఆ ఫోటోలు చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.
ఇలాగే ఉండండి చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరి కొంతమంది బొద్దుగా ఉన్నప్పుడే చాలా అందంగా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఏదైతే ఏంటి ప్రస్తుతం ఆ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయని చెప్పాలి.







